Leading News Portal in Telugu

Heavy rain alert: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. లిస్టు విడుదల



Rain

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అధికారులు హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌-వాయువ్య భారతదేశం మీదుగా అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ తెలిపారు. తాజా వాతావరణ పరిస్థితులను ఆమె మీడియాకు తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అలాగే బలమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Food Poisoning: 10 ఏళ్ల చిన్నారి ప్రాణం తీసిన బర్త్ డే కేక్

ఇక పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌పై గాలులు, వడగళ్ల వాన కురుస్తాయని పేర్కొన్నారు. ఇక ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అల్పపీడనం తూర్పు దిశగా కదులుతుందని.. ఈ కారణంగా ఈశాన్య భారతదేశంలో వర్షపాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Anchor Suma: ఆ సీన్ చూసి ఏడ్చేశాను.. హిట్ సినిమాకి సుమ రివ్యూ వైరల్!