Leading News Portal in Telugu

Nani 33: దసరా డైరెక్టర్‌తో మరో సినిమా అనౌన్స్ చేసిన నాని.. అదొక్కటే నిరాశ!



Nani 33

Nani announces his 33rd Movie with Dasara Team: నాని హీరోగా నటించిన గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన దసరా సినిమా సూపర్ హిట్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఇదే రోజు గత ఏడాది రిలీజ్ అయిన ఆ సినిమా నాని కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ఒక కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో నాని హీరోగా నటిస్తున్న మరో సినిమాని అనౌన్స్ చేశారు.

Daniel Balaji: చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన బాలాజీ.. ఏంటో తెలుసా?

నిజానికి దసరా సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ అది నిజం కాదని తెలుస్తోంది ఇప్పుడు చేస్తున్న సినిమా వేరే సబ్జెక్ట్ అని దసరా సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి పొంతన ఉండదని చెబుతున్నారు. ఆ ప్రచారానికి ఊతం ఇచ్చే విధంగానే ఒక స్టైలిష్ లుక్ లో నాని కళ్లద్దాలు పెట్టుకుని బీడీ తాగుతున్నట్టుగా ఉన్న ఒక ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నాని కెరియర్ లో 33వ సినిమాగా చెబుతున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం చేస్తున్నాడు ఇది ఆయనకి రెండవ సినిమాగా నిలవబోతోంది. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ కి తొమ్మిదవ సినిమాగా ఈ సినిమా నిలుస్తోంది. ప్రస్తుతానికి నాని 33వ సినిమా అని సంబోధిస్తున్న ఈ సినిమాకి సంబంధించి అధికారికి టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది.