Leading News Portal in Telugu

Kakarla Suresh: వింజమూరు మండలంలో వైసీపీ ఖాళీ కాబోతోంది..



Kakrla Suresh

వింజమూరు మండల కేంద్రంలో శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం దద్దరిల్లింది. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో.. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాగళం సభకు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలని జనం చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు. చంద్రబాబు నాయుడు మాటలు ఆసక్తిగా విన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. పెద్ద ఎత్తున టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో వింజమూరు మండలానికి చెందిన ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారిలో సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, వనిపెంట హైమావతి, బసిరెడ్డి సుమలత, యాకసిరి భవాని, సాదం మౌనిక, కాటం ప్రసన్న, వింజమూరు మండలం ఎంపీపీ ఇనగనూరి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాదం మౌనిక జనసేన పార్టీ తరఫున గెలిచినప్పటికీ వైసీపీ అనుబంధంగా వ్యవహరిస్తుంది. ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంది.

Andhra Pradesh: వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు

వింజమూరు మండలంలో మంచి పట్టున్న నాయకుడిగా పేరుపొందిన వనిపెంట సుబ్బారెడ్డి టీడీపీలోకి రావడంతో ఆయన అనుచర వర్గం హర్షం వ్యక్తం చేస్తుంది. జననేతగా పేరున్న వనిపెంట సుబ్బారెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తాను చాటనున్నారు. గత ఎంపీపీ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో ఇప్పటికే రుజువు చేసుకొని ఉన్నారు. ఏప్రిల్ 10వ తేదీ లోపల భారీ ఎత్తున వైసీపీ సీనియర్ నాయకులు టీడీపీలో చేరెందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ప్రజా గళం సాక్షిగా చెప్తున్నాను. వచ్చే పదిరోజుల్లో వింజమూరు మండలంలో వైసీపీ ఖాళీ కావడం ఖాయమని ఘంటా పదంగా తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విశ్వాసం కోల్పోయారని.. ఉదయగిరి ప్రజల దీవెనలతో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నట్లు సభ సాక్షిగా తెలిపారు. ఉదయగిరిలో తాను, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవడం తధ్యం అని అన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, యువతకు ఉద్యోగాలు వస్తాయని, మెట్ట ప్రాంతానికి సాగు త్రాగునీరుతో పాటు.. సమ్మర్ స్టోరీస్ ట్యాంకు నిర్మాణం జరుగుతుందని ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా మారుస్తానని పేర్కొన్నారు.