
Daniel Balaji Died Without Fulfilling His Final Wish: విలన్ పాత్రలతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు అనే వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. డేనియల్ బాలాజీ వయస్సు కేవలం 48 సంవత్సరాలు. హార్ట్ ఎటాక్ తో డేనియల్ చనిపోయాడన్న వార్త బయటకు వచ్చినప్పుడు సినీ జనాలను ఎక్కువగా బాధపెట్టేదేమిటంటే ఏకైక కోరికతో సినిమాల్లోకి నటుడిగా మారిన డేనియల్ బాలాజీ కోరిక చివరికి కూడా నెరవేరలేదు. అవును తన మేనమామ సిద్దలింగయ్య వారసత్వాన్ని అనుసరించి సినిమాల్లోకి వచ్చిన బాలాజీ కోరిక మామలా దర్శకుడు కావాలనేది. అంతేకాదు డేనియల్ బాలాజీ చెన్నై తారామణి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ కోర్సు కూడా పూర్తి చేశారు. ఇక కమల్ హాసన్ హీరోగా నటించిన మరుదనాయకం సినిమా యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించాడు. అయితే కొన్ని కారణాలతో కానీ సినిమా ఆగిపోయింది. తర్వాత నటనపై దృష్టి సారించిన బాలాజీ దర్శకత్వం చేయాలనే కోరికను వదులుకోలేదు.
Manjummel Boys: తెలుగులో చిరంజీవి, బాలయ్య, బన్నీతో సినిమాలు చేస్తా: డైరెక్టర్ చిదంబరం ఇంటర్వ్యూ
తను నటించిన చాలా సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఇక ఆయన దర్శకుడిగా చేయాలనుకున్న సినిమాకి కథ సహా అన్నీ సిద్ధమయ్యాయి. అయితే నిర్మాత దొరకడం కష్టమైంది. అందుకోసం చాలా మందిని సంప్రదించాక కూడా అది వర్కౌట్ కాలేదు. ఇక అంతేకాదు ఒక్కసారి మృత్యువుతో ముఖాముఖి పోరాడి వచ్చినట్లు కూడా బాలాజీ గతంలో వెల్లడించారు. కోవిడ్ రెండవ వేవ్ సమయంలో అతనికి ప్రాణాపాయం ఏర్పడడంతో మూడు రోజుల తర్వాత చనిపోతాడని వైద్యులు అభిప్రాయపడ్డారు. కానీ దాని నుండి కూడా తాను బయటపడ్డానని చెబుతూ ఉండేవారు. అక్కడి దాకా వెళ్లి వచ్చాక తాను ఎల్లప్పుడూ మరణాన్ని ఆశిస్తున్నానని బాలాజీ ఆ ఇంటర్వ్యూలో బహిరంగంగా కామెంట్ చేశారు. నేను ఒంటరిగా జీవిస్తున్నాను, ఒక్కరోజు కూడా నిద్ర లేవకపోతే వచ్చి చూడమని నా స్నేహితుడికి చెప్పానని అన్నారు.