Leading News Portal in Telugu

మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ.. బలప్రదర్శనకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే రామానాయుడు!



మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామానాయుడు బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. నేడు నాలుగు మండలల్లో బైక్ ర్యాలీ, భారీ సమావేశం జరగనుంది. ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. అయితే వ్యతిరేకత పెరగడంతో మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది.

డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు సిట్టింగ్ సీటులో వైసీపీ మార్పులు చేసింది. ముత్యాల నాయుడుని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా, ఆయన కుమార్తె అనూరాధకు మాడుగుల టిక్కెట్లు ఖరారు చేసింది. దాంతో డిప్యూటీ సీఎం కుమారుడు రవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయినట్లు తెలుస్తోంది.