
మద్యం తాగొద్దని చెప్పినందుకు తన కుమారుడిని దుండగులు హత్య చేశారని ఓ తల్లి ఆరోపిస్తుంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. జహంగీర్‌పురిలో దుండగులు 19 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళ్తే.. మద్యం తాగవద్దని యువకుడి తల్లి కొందరు అగంతకులకు చెప్పింది. దీంతో.. కోపోద్రిక్తులైన దుండగులు ఆమె కొడుకును చంపేశారు.
Read Also: Bride Died: విషాదం.. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి
యువకుడు రక్తపు మడుగులో పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని సమీపంలోని బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా.. అప్పటికే యువకుడి శరీరం నుంచి చాలా రక్తం పోయింది. దీంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Read Also: Saina Nehwal: కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మండిపాటు..
కాగా.. ఘటనకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. దుండగుల నేర చరిత్రను విచారించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. విచారణలో హత్యకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు విచారణలో మాట్లాడుతూ.. యువకుడితో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, అతని తల్లి వారిని మందలించినందుకే ప్రతీకారంగా తమ కొడుకును చంపినట్లు తెలిపారు. మరోవైపు.. తన కొడుకు మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.