Leading News Portal in Telugu

Pakistan: ‘రెడ్ కార్పెట్’లపై నిషేధం.. ఖర్చులని తగ్గించుకోవాలని పాక్ నిర్ణయం..



Pm Shahbaz Sharif

Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్ ఖర్చుల్ని తగ్గించుకుంటోంది. దుబారా ఖర్చులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘రెడ్ కార్పెట్’ల వినియోగాన్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం దౌత్యపరమైన కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు. ఫెడరల్ మినిష్టర్స్, సీనియర్ అధికారుల పర్యటన సందర్భంగా రెడ్ కార్పెట్ వేయడంపై పాక్ ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also: Rahul Gandhi: మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400 సీట్లు సాధ్యమా..? బీజేపీపై రాహుల్ గాంధీ ఆరోపణలు..

పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉంది. పొదుపు చర్యల్లో భాగంగా పీఎం షెహబాజ్ షరీఫ్, క్యాబినెట్ మంత్రులు జీతాలు, ఇతర ప్రోత్సహాకాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి ముందు పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ కూడా తన జీతాన్ని వదులుకునేందుకు సిద్ధమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ -నవాజ్(పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టోకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు కలిసి సంక్షీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధికారం చేపట్టిన తర్వాత పాక్ ప్రధాని మాట్లాడుతూ.. దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. పేదరికం, ద్రవ్యోల్భణం, నిరుద్యోగంతో పాకిస్తాన్ అల్లాడుతోంది. ఆరోగ్యం, ఆహారం, జీవన ప్రమాణాలు తగ్గాయని, 2023లో పాకిస్తాన్ తన చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని హ్యూమన్ రైట్స్ వాచ్(HRW) పేర్కొంది.