
మోడీ సర్కారు రాజ్యాంగ పునాదులు కూల్చేస్తుందlr, బీజేపీకి 2019 ఫలితాలు రావనే భయం పట్టుకుందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భయం లేకుంటే కేజ్రీవాల్.. సోరేన్ లను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు కకావికాలం చేసి.. బలహీన పరిచే ఎత్తుగడలో బీజేపీ ఉందని, బీజేపీ బలంగానే ఉంటే ప్రతిపక్ష పార్టీల నాయకులను చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారన్నారు. నీతికి నిర్వచనం మార్చేశారు మోడీ అని, బీజేపీ లో ఉంటే నీతి..ప్రతిపక్ష పార్టీలో ఉంటే అవినీతి అనేట్టు చేశారన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్ లు మెజార్టీ బీజేపీ కె వెళ్లాయని, సుప్రీంకోర్టు గట్టిగా ఉండటంతో బయటకు వచ్చాయన్నారు.
Harish Rao : కాంగ్రెస్ పాలనలో లీకులు ఇస్తూ .. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు
బీఆర్‌ఎస్ ఆపరేషన్ చేసి కాంగ్రెస్ ని ఊడ్చేశారని, రేవంత్ వచ్చి బీఆర్‌ఎస్‌ని ఊడ్చేశారన్నారు బీవీ రాఘవులు. ఎన్నికల తరవాత ఏమవుతుందో చెప్పలేమని, బీజేపీ తెలంగాణ లో పాగా వేసే పనిలో ఉందన్నారు బీవీ రాఘవులు. కాంగ్రెస్ దీనిపై దృష్టి పెట్టాలని, కాంగ్రెస్ సంప్రదింపులు చేయాలన్నారు. పెద్ద పార్టీ చర్చలు చేయాలని కూటమిలో నిర్ణయమని, ఇక్కడ కాంగ్రెస్ మాట్లాడటం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు అలాగే చేశారని, పార్లమెంట్ ఎన్నికలలో అలాగే చేస్తున్నారన్నారు బీవీ రాఘవులు.
Palvancha Rural Police: పాల్వంచ పోలీసులు నయా రూల్స్.. ట్రాక్టర్ కు సీటు బెల్ట్ లేదని జరిమానా..!