Leading News Portal in Telugu

Harish Rao: ఐదేళ్లకు మించి పాలించిన చరిత్ర కాంగ్రెస్‌లో లేదు.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ..



Revanth Reddy Harish Rao

Harish Rao: కాంగ్రెస్ చరిత్రలో ఐదేళ్ల కు మించి పాలించిన చరిత్ర లేదని, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి వెళ్లిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం ఎక్కువ కనిపిస్తుందన్నారు. ద్రోహం చేసిన కడియం శ్రీహరి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అవసరం అయితే రాజకీయాల నుండి తప్పుకుంటను కానీ పార్టీ మారను అన్న మీరు ఎలా పార్టీ మారారో చెప్పాలన్నారు. విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి రాజీనామా చేసి మాట్లాడాలన్నారు.

Read also: Leopard Attack: ఇంట్లోకి దూసుకొచ్చిన చిరుత.. ఐదుగురిపై దాడి..!

రేవంత్ రెడ్డి రాత్రి పూట లకెబిందలు వేతికే వ్యక్తి అని చెప్పిన కడియం శ్రీహరి.. ఈ రేవంత్ రెడ్డి తోనే ఈ రోజు కండువా కప్పుకున్నావని, నీ విలువు ఎక్కడ పోయే అని మండిపడ్డారు. కేసీఆర్ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేశారని, కాకతీయ తోరణాన్ని రాష్ట్ర చిహ్నాన్ని తొలగిస్తే వరంగల్ అగ్ని గుండం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమి అమలు చేయడం లేదన్నారు. ప్రజలు కోపం మీద అన్నారు అందుకే లీక్ వార్త .. ఫేక్ వార్తలు ఇచ్చి తప్పు దారి పట్టిస్తున్నారు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణ మాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి అది చేయలేదన్నారు.

Read also: Palla Rajeshwar Reddy: కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తాం..!

రుణమాఫీ చేయని కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పాలన్నారు. రుణమాఫీ చేయని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నారు. వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వని కాంగ్రెస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో బొందా పెట్టాలన్నారు. రైతులకు రైతు బందు ఇచ్చేందుకు ఇచ్చిన రెడీ చేసిన డబ్బులు కాంట్రాక్టర్లకు నుంచి రైతులను మోసం చేసాడు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. మహిళకు 10 వేలు బకాయి పడ్డా కాంగ్రెస్ మహిళలకు 10 వేలు ఇచ్చిన తర్వాత ఓట్లు అడుగాలన్నారు. మాయ మాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు పెద్ది పెద్ది ముచ్చట్లు చెబుతున్నారన్నారు.

Read also: Uttam Kumar Reddy: కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే.. కామన్ సెన్స్ ఉండాలి..!

ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తుఫాన్ సందర్భంగా ఆంధ్ర వాళ్ళు డబ్బులు ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి నీ తెలంగాణ కు డబ్బులు ఇవ్వలేకపోతే నోరు తెరవని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ విమర్శిస్తున్నారన్నారు. కడియం శ్రీహరి పోయిన తర్వాత బీఎస్ పార్టీ శ్రేణుల్లో కసి ఎక్కువగా కనిపిస్తుందన్నారు. ద్రోహి పోయిన ఆనందంలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి ద్రోహికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నీకు కల్పించినన్ని అవకాశాలు ఎవరికీ కల్పించలేదన్నారు. నీకు నీతి.. నిజాయితీ.. నైతిక విలువలు ఉంటే వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వయసులో పార్టీ మారడానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు.

Read also: Babu Mohan: బీజేపీ పార్టీ టికెట్ ఇస్తానని ఇవ్వలేదు.. బాబుమోహన్ కీలక వ్యాఖ్యలు..

రేవంత్ రెడ్డి దొంగ అని విమర్శలు చేసిన కడియం ఇప్పుడు ఆయనతోనే కండువా కప్పించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అంటూ ప్రశ్నించారు. మళ్ళీ అధికారం లోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..కాంగ్రెస్ చరిత్రలో ఐదేళ్ల కు మించి పాలించిన చరిత్ర లేదన్నారు. రాజముద్రలో కాకతీయ తోరణం చిహ్నాన్ని తొలగిస్తామంటున్నారని, కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అయితది అన్నారు. కాకతీయ తోరణం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అన్నారు. అన్నీ లీకులు.. ఫెక్ వార్తలు తప్ప పాలన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rishabh Pant Fine: రిషబ్ పంత్‌కు భారీ జరిమానా.. రిపీట్ అయితే అంతే సంగతులు!