
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ కు నిన్నటి ఆదరణ చూస్తుంటే నిజంగానే నల్లగొండ జిల్లాలో ఓడిపోయామా అనిపించిందన్నారు. చేసింది చెప్పుకొకపోవడం, ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామని, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు పార్లమెంట్ ఎన్నికలో జరగొద్దన్నారు. నోటిఫికేషన్ లు ఇచ్చినా… మనం నిరుద్యోగ యువత మనసు గెలుచుకొలేకపోయమని, అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం ఉద్యోగులు బీఆర్ఎస్ కు వ్యతరేకంగా ఓటు వేశారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన లేదని, రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ఉండాలి, ఇచ్చిన ప్రతిహమి అమలు చేయాలన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి కి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో ముప్పుందని, సీఎం పదవి కోసం బీజేపీ కీలక నేత నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితంగా ఉంటున్నాడన్నారు కేటీఆర్.
పార్లమెంట్ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి శరణు, షెల్టర్ కోసం కాంగ్రెస్ నుండి బీజేపీతో కలుస్తారన్నారు. అనంతరం నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో గన్నెబోయిన మల్లయ్య ను పరామర్శించారు కేటీఆర్. వంట నష్టపోయి, అప్పులపాలయ్యనని ఆవేదన వ్యక్తం చేసిన గన్నెబోయిన మల్లయ్య వీడియో కొద్ది రోజుల క్రితం వైరల్ అయ్యింది.. ఆ వీడియోకు స్పందించిన కేటీఆర్.. మల్లయ్య ఇంటికి వెళ్ళి, ఆయన్ను పరామర్శించి భరోసా ఇస్తానని ఎక్స్ X లో హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే ముషంపల్లికి చేరుకున్న కేటీఆర్. గన్నేబోయిన మల్లయ్య కు లక్ష రూపాయల చెక్ అందజేశారు. కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని తెలంగాణ ప్రజలు చెప్తున్నారని, కేసిఆర్ పర్యటనతో కదిలిన ప్రభుత్వం.. కాళేశ్వరం నుండి ప్రస్తుతం సాగు నీరు విడుదల చేస్తుందన్నారు కేటీఆర్. మూడు పిల్లర్లలో సమస్య వస్తే.. పరిష్కరించేందుకు 3 నెలలు సరిపోలేదా ప్రభుత్వానికి.. ఎకరానికి 25 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.