
అమ్మమ్మల కాలంలో ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వాడేవారు.. అలా వండినవి ఎంతో రుచిగా ఉండటం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి చాలా మంచిది.. కానీ ఇప్పుడు టెక్నాలజీని జనాలు బాగా ఉపయోగించుకుంటున్నారు.. ట్రెండ్ కు తగ్గట్లే వంటకు నాన్ స్టిక్ పాన్స్ లల్లో వండుతున్నారు.. ఇలా వండటం వల్ల వంట త్వరగా అవుతుందేమో కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. అంతేకాదు ఆ పాన్స్ లో కొన్ని రకాల వంటలను వండకూడదని చెబుతున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం..
నాన్ స్టిక్ ప్యాన్స్ వాడడాన్ని చాలా మంది ఇంట్లో కామన్ అయిపోయింది. అయితే, వీటిని క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్లు తీసుకోవాలి. ఇతర గిన్నెల్లా వీటిని తోమకూడదు. ఇలా చేస్తే వాటిపై కోటింగ్ పోతుంది.. అందుకే వాటిని కడిగేటప్పుడు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..
ఈ పాన్స్ లలో టమోటాలు,నిమ్మకాయల వంటి ఆహారాలు వాడకపోవడమే మంచిది. ఇవి నాన్ స్టిక్ తవా బేస్‌ని నాశనం చేస్తాయి.. ఆమ్లత్వం ఎక్కువగా ఉండే వాటిని వాడటం అంత మంచిది కాదు.. అవే ఆ పాన్ ను పాడుచేస్తాయి..
దోసకు ఎక్కువగా నాన్ స్టిక్ ప్యాన్ లను వాడుతారు.. కానీ ఆ పెనాల పై నూనెను అసలు వాడోద్దని చెబుతారు.. కానీ వాటికి కొంచెం వేసి మళ్లీ పేపర్ తో తుడిచి వాడవచ్చు అని చెబుతున్నారు..
ఇకపోతే కిచెన్‌లో ఈ కుక్వేర్ని ప్లేస్ చేసే స్థలం కూడా సరిగ్గా ఉండాలి. కోసుగా ఉండే అంచులు ఉన్న కంటెయినర్ మధ్యలో వీటిని పెట్టొద్దు. వాటిని సపరేట్ ప్లేస్‌లో పెట్టండి..ఎందుకంటే వాటికి గీతలు పడకుండా చూసుకోవాలి.. ఇక చివరగా వండిన వెంటనే వాటిని అసలు నీటిలో వెయ్యకూడదు.. అలా చేస్తే కోట్ పోతుంది.. అందుకే చల్లార్చి వెయ్యడం మంచిది.. నాన్ స్టిక్ పాన్స్ వాడుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి..