
అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాలకు పేరు మార్చడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ రోజు తిరస్కరించింది. అయితే, గత కొంతకాలంగా భారత్‌లో అంతర్బాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదని చైనా వాదిస్తుంది. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన 30 కొత్త పేర్లతో కూడిన నాల్గవ జాబితాను చైనా విడుదల చేసిన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా మండిపడింది.
Read Also: Putha Chaithanya Reddy: కమలాపురం టీడీపీలోకి వలసలు..
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో స్థలాల పేరు మార్చడానికి చైనా తన తెలివిలేని ప్రయత్నాలను కొనసాగించింది అని భారత విదేశాంగ శాఖ పేర్కొనింది. మేము అలాంటి ప్రయత్నాలను గట్టిగా తిరస్కరిస్తున్నాము.. కనుగొన్న పేర్లను కేటాయించడం అరుణాచల్ ప్రదేశ్‌గా ఉన్న వాస్తవికతను మార్చదు.. ఆ రాష్ట్రం ఎల్లప్పుడూ భారత్ లో అంతర్భాగంగా ఉంటుంది అని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, మార్చి 28వ తేదీన బీజింగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సంబంధించిన కొత్త పేర్లను ప్రకటిస్తూ.. తన అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చింది.
Read Also: Fake Doctors: నకిలీ వైద్యులు, ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థలపై టీఎస్‌ఎంసీ ఉక్కుపాదం..
అలాగే, గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అరుణాచల్ ప్రదేశ్ లో 30 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై ప్రశ్న ఎదురైంది. దానికి కేంద్రమంత్రి తనదైన శైలీలో ఆన్సర్ ఇచ్చారు. నేనొచ్చి ఒకరి ఇంటికి ఉన్న పేరును మార్చేస్తే.. ఆ ఇళ్లు నా సొంతం అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎప్పటికి భారత్‌లో అంతర్భాగమే.. చైనా ఎన్ని పేర్లు పెట్టుకున్న ఎలాంటి ప్రభావం ఉందడు.. అలాగే, వాస్తవాధీన రేఖ దగ్గర భారత సైన్యం కాపలా ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.