
Istanbul: టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా.. 8 మంది గాయపడినట్లు నగర గవర్నర్ తెలిపారు. గైరెట్టెప్ పరిసరాల్లో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కి చేరిందని ఆయన ప్రకటించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.
Read Also: Rajasthan High Court: వివాహేతర శృంగారం నేరం కాదు..
సెంట్రల్ ఇస్తాంబుల్ డిస్ట్రిక్ట్ బెసిక్తాస్‌లో భాగంగా ఉన్న గైరెట్టెప్‌లోని 16 అంతస్తుల భవనంలోని బేస్‌మెంట్ నిర్మాణ పనుల సమయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బేస్‌మెంట్‌లో నైట్ క్లబ్ ఉన్నట్లు చెప్పారు. అయితే, ప్రమాదానికి గల కారణాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.