
Fire Accident: గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ఈ ప్రమాదాలు చాలా వరకు షార్ట్ సర్క్యూట్ వల్లే జరుగుతున్నాయి. సాధారణంగా రసాయనాలు, బాణసంచా మరియు ప్లాస్టిక్ కర్మాగారాల్లో అగ్ని భద్రతను ఉంచాల్సిన అవసరం ఉంది. అలాగే, పత్తి గోడౌన్లు, కలప టిపోలు మరియు వస్త్ర కర్మాగారాలలో సరైన అగ్ని భద్రతను నిర్వహించాలి. కానీ ఈ విషయంలో కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నా వాటి నుంచి సకాలంలో రక్షణ పొందలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కాటేదాన్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది.
Read also: 2019 World Cup: 2019 ప్రపంచకప్ ఫైనల్‌లో తప్పిదం చేశాం.. ఇంగ్లండ్ కప్ గెలిచేదే కాదు! అంపైర్ సంచలన వ్యాఖ్యలు
సాయిబాబా నగర్ లోని విమల్ ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరగడంతో.. మంటలకు తోడు నల్లటి పొగ దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. హుటాహుటిన ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగులుగా పరిశ్రమలు ఉండటం.. వాటి ద్వారా ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాటేదాన్ లో ఎక్కడ చూసిన ఇలాంటి పరిశ్రమలే ఎక్కువ ఉండటంతో తరుచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి కైనా అధికారులు కాటాదాన్ పారిశ్రామిక ఫ్యాక్టరీలపై దృస్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
మరోవైపు మాల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్.టి.సి కాలనీలో ఒక ఇంట్లో ఎసిడ్, ఫినాయిల్ గోడౌన్, దుకాణం నిర్వహిస్తున్నారు. అందులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దాలతో మంటలు భారీగా వ్యాపించడంతో భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు కొందరు ధైర్యం చేసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది ఇప్పటి వరుకు వివరాలు తెలియలేదు.
DC vs KKR: గెలుపులతో ఫుల్ జోష్ లో ఇరు జట్లు.. మరి ఈసారి విజయం ఎవరికీ వరించేనో..?!