Leading News Portal in Telugu

Hundi Robbery: గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కున్న దొంగ చెయ్యి.. చివరకి..?!



Whatsapp Image 2024 04 03 At 9.48.53 Am

ఈ మధ్యకాలంలో చాలామంది మనుషులు జీవితంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించే మార్గంలో వక్రదారులు పడుతున్నారు. కష్టపడి సంపాదించకుండా., ఇతరుల సొమ్ము కాజేసి వాటిని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఎంజాయ్ చేసేవారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనపడుతున్నారు.

Also read: World Bank: ఈ ఏడాది భార‌త ఆర్థిక వృద్ధి 7.5 శాతం పెరిగే ఛాన్స్..

ముఖ్యంగా ఇలాంటివారు వేరే ఇళ్లలో దొంగతనాలు చేయడం.. అవి సరిపోకపోతే రోడ్లపై వెళ్లే వారి నుండి బంగారు ఆభరణాలను చోరీ చేయడం.. అవి చాలానన్నట్లు అప్పుడప్పుడు కొందరు దొంగలు బరితెగించి గుళ్ళలో కూడా దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఎందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also read: Anupama Parameswaran: చిలిపి నవ్వులతో శారీలో మెరుస్తున్న అనుపమ పరమేశ్వరన్..

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి లోని మాసుపల్లి పోచమ్మ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇకపోతే ఇదే ఆలయంలో పని చేసే సురేష్ హుండీ చోరికి యత్నం చేసాడు.
హుండీలో డబ్బులు తీసేందుకు చేయి పెట్టిన దొంగ సురేష్, హుండీలో చేయి ఇరుక్కుని నరకయాతన అనుభవించాడు. దాంతో నేడు ఉదయం ఆలయం తెరిచే సమయానికి పరిస్థితిని అర్థం చేసుకొని గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దింతో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.