Leading News Portal in Telugu

Defamation Notice: ఢిల్లీ మంత్రి అతిషికి బీజేపీ ప‌రువు న‌ష్టం నోటీసు..



Delhi

ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి అతిషిపై బీజేపీ ప‌రువు న‌ష్టం దావా కింద నోటీసులు జారీ చేసింది. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీలో చేరాల‌ని.. లేదంటే అరెస్టు తప్పదని ఓ కమలం పార్టీ నేత తనను అడిగినట్లు ఆమె నిన్న ( మంగళవారం ) ఆరోపించిన విష‌యం తెలిసిందే. కాగా, ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో త‌న‌తో పాటు మ‌రో ముగ్గురు ఆప్ వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తారని పేర్కొనింది. ఈడీ అధికారుల అరెస్టు నుంచి త‌ప్పించుకోవాలంటే బీజేపీలో చేరాల‌ని ఓ వ్యక్తి తనను ఆశ్రయించినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Read Also: CM YS Jagan: నేను విన్నాను, నేను ఉన్నాను.. పెరాలసిస్‌ బాధితుడికి సీఎం జగన్ భరోసా!

అయితే, మంత్రి అతిషికి డిఫ‌మేష‌న్ నోటీసు పంపామ‌ని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర స‌చ్‌దేవ్ చెప్పారు. త‌నను ఎవ‌రు ఆశ్రయించారు.. ఎప్పుడు ఆ ఘటన జరిగింది.. దానికి సంబంధించిన సాక్ష్యాల‌ను అతిషి ఇవ్వలేక‌పోయిన‌ట్లు ఆయ‌న ఆరోపణలు చేశారు. త‌న ఆరోప‌ణ‌ల‌ను ప్రూవ్ చేసేందుకు ఫోన్‌ను ద‌ర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ స‌చ్‌దేవ్ కోరారు. అయితే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆప్ నేతలను బీజేపీ టార్గె్ట్ గా చేసుకుందని మంత్రి అతిషి వెల్లడించింది.