Leading News Portal in Telugu

AP High Court: తెలుగులో అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు.. ఈసీకి హైకోర్టు ఆదేశాలు..



Ap High Court

AP High Court: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు తెలుగులో ఇచ్చే విధంగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోర్టుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో ఈ వివరాలను పొందురిచేలా చూడాలని కోరారు.. అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలు ఈసీ వెబ్‌సైట్‌లో ఇంగ్లీష్ తో పాటు తెలుగులో అందుబాటులో ఉంచాలని హైకోర్టుకు విన్నవించారు పిటిషనర్.. ఇక, తెలుగు పత్రికల్లో కూడా అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలు ప్రచురించాలని కోరారు.. ఇక, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు.. దీనిపై ఎన్నికల సంఘం తన స్పందనను హైకోర్టులో ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. మరోవైపు ఆ పిటిషన్‌పై తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. కాగా, సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. అభ్యర్థులను ప్రకటించిన ఆయా పార్టీలు.. ప్రచారాన్ని విస్తృతం చేసిన విషయం విదితమే.