Leading News Portal in Telugu

Intermediate Board: ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు వార్నింగ్



Interboard

Intermediate Board: షెడ్యూల్ రాకముందే అడ్మిషన్‌లు తీసుకుంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీల పై చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. పీఆర్వోలను పెట్టుకొని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్‌లో అడ్మిషన్లు చేయిస్తున్నాయనే అంశం తమ దృష్టికి వచ్చిందని బోర్డు వెల్లడించింది. ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేయక ముందు అడ్మిషన్‌లు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వ్యవహరిస్తున్నాయని మండిపడింది. తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పు దారి పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

ఇంకా జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు 2024-25 విద్యా సంవత్సరానికి ఇవ్వలేదని అధికారులు వెల్లడించారు. అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీ ల్లోనే (షెడ్యూల్ ప్రకారం) విద్యార్థులను జాయిన్ చేయాలని రూల్స్‌ గురించి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. జిల్లా ఇంటర్ విద్యా అధికారులు నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.