
Manju Pillai Sujith Vasudev Divorce: ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన అనేక జంటలు వివాదాల కారణంగా విడాకులు తీసుకుంటూ ఉండగా ఇప్పుడు అలాంటి ఒక అంశం తెర మీదకు వచ్చింది. మలయాళ నటి మంజు పిళ్లై, అలాగే ఆమె భర్త, తెలుగులో నాలుగు సినిమాలు చేసిన సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సుజిత్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2020లోనే మంజు నుంచి విడిపోయానని, ఈ మధ్య విడాకుల కూడా ప్రక్రియ పూర్తయిందని ఆయన చెప్పాడు. అయితే మంజు ఇప్పటికీ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని సుజిత్ చెబుతన్నారు. ‘‘2020 నుంచి విడివిడిగా జీవిస్తున్నాం, మేము గత నెలలో విడాకులు తీసుకున్నాము. ఇప్పుడు నేను మంజుని స్నేహితురాలు అని పిలవాలనుకుంటున్నాను ఎందుకంటే మా స్నేహం ఇప్పటికీ ఉందని అన్నారు.
Nayanthara: చిన్నప్పటి నయనతారని చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో?
మంజు కెరీర్ బాగానే సాగుతోందని అంత సక్సెస్ ఫుల్ గా ఆమె కెరీర్ ను చూసిన ఆనందంగా ఉందని కూడా అన్నారు. నటి మంజు పిళ్లై మరియు సుజిత్ వాసుదేవన్ 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి దయా అనే కుమార్తె ఉంది. వీరిద్దరూ విడిపోయారనే రూమర్లు చాలా కాలంగా వినిపిస్తున్నా ఈ విషయంపై బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి. ఇక ఇటీవల హోమ్, ఫలిమి, జయజయ జయహై వంటి సినిమాలో మంజు పిళ్లై గుర్తుండి పోయే పాత్రల్లో నటించింది. ఇక సుజిత్ వాసుదేవ్ విషయానికి వస్తే మలయాళంలో లూసిఫర్, ఎంపురాన్ వంటి హిట్ చిత్రాలకు సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్. తెలుగులో ఆయన కీర్తి సురేష్ మిస్ ఇండియా, రవితేజ ఖిలాడీ, రామ్ ది వారియర్, పవన్ బ్రో సినిమాలకు సినిమాటోగ్రాఫీ అందించారు.