Leading News Portal in Telugu

Jupalli Krishna Rao: మాజీ సీఎం కేసీఆర్‌పై జూపల్లి ఫైర్



Jupalli Krishna Rao

Jupalli Krishna Rao: మాజీ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. నవ్వితే నాలుగేళ్లు అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పదేళ్లు కేసీఆర్ ప్రగతి భవన్‌లో, ఫాంహౌస్‌లో పడుకున్నారని.. తమ ప్రభుత్వం ప్రతి నిత్యం ప్రజల కోసమే పని చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడునెలలు అయ్యిందని.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామన్నారు. మీకు చేతకాక మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Intermediate Board: ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు వార్నింగ్

కేటీఆర్‌కు, హరీష్‌కు నైతికత లేదు.. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడొద్దు, నిజాయితీగా మాట్లాడాలన్నారు. 12 సార్లు కాదు 30 సార్లు ఢిల్లీకి వెళ్తామని.. మా నాయకుడిని కలుస్తామని ఆయన అన్నారు. రైతుల గురించి బీఆర్‌ఎస్ నాయకులకు మాట్లాడే హక్కు లేదన్నారు. రాష్ట్రంలోని ఏ చౌరస్తాకు అయినా వస్తామని, గడిచిన పదేళ్లలో రైతులకు మీరు ఇచ్చిన వాటిపై చర్చిద్దామని కేసీఆర్‌, కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.