
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. ఏప్రిల్ 1న ఆయన్ను అధికారులు జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో కేజ్రీవాల్‌ను తీహార్ జైల్లో పెట్టారు. ఇదిలా ఉంటే తీహార్ జైలుకు పంజాబ్ సీఎం కార్యాలయం లేఖ రాసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ మేరకు జైలు అధికారులకు సీఎంవో లేఖ రాసింది.
ఇది కూడా చదవండి: CM YS Jagan: ఇది చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం..
మార్చి 21న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైల్లో పెట్టారు
ఇది కూడా చదవండి: Medicine Prices: ఏప్రిల్ నుంచి మెడిసిన్ ధరల పెంపు అంతా ఉత్తదే.. కేంద్రం క్లారిటీ..
మరోవైపు అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ, కేజ్రీవాల్‌కు చెందిన న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును గురువారం మధ్యాహ్నానానికి రిజర్వ్ చేసింది. మరీ గురువారం ఎలాంటి తీర్పు రానుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Boney Kapoor: శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అర్జున్ తల్లిని వదిలేశా.. కానీ ఆమె బంగారం!
ఇంకోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినట్లుగా తీహార్ జైలు అధికారులు తెలిపారు. జైలుకు వచ్చిన దగ్గర నుంచి నీరసంగా ఉంటున్నారని.. షుగర్ లెవల్స్ కూడా పడిపోయాయని పేర్కొన్నారు. నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారని అధికారులు వెల్లడించారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Boney Kapoor: శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అర్జున్ తల్లిని వదిలేశా.. కానీ ఆమె బంగారం!