Leading News Portal in Telugu

Pawan Kalyan: ఇళ్ల దగ్గర పెన్షన్ల పంపిణీకి ఇబ్బంది ఏంటి..? పవన్‌ ఫైర్‌



Pawan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు పెన్షన్‌ పంపిణీ వ్యవహారం వివాదాస్పందంగా మారింది.. రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా.. పెన్షన్‌ కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వృద్ధులు.. ఏపీలో ఈ రోజు ఇద్దరు వృద్ధులు పెన్షన్‌ కోసం వెళ్లి కుప్పకూలి ప్రాణాలు వదిలారు.. తిరుపతి జిల్లా నెరబైలులో పెన్షన్‌ కోసం వెళ్లి వడదెబ్బతో షేక్‌ సాహెబ్‌ అనే వృద్ధుడు కన్నుమూయగా.. కృష్ణా జిల్లా గంగూరులో పెన్షన్‌ కోసం వెళ్లిన వజ్రమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు కూడా వడదెబ్బతో మృతిచెందింది.. అయితే, పెన్షన్‌ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. అసలు ఇళ్ల దగ్గర పెన్షన్ల పంపిణీకి ఉన్న ఇబ్బంది ఏంటి? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Read Also: Vey Dharuvey OTT: ఓటీటీలోకి రాబోతున్న మాస్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పెన్షన్ల వ్యవహారంపై ట్విట్టర్‌ (ఎక్స్‌)లో స్పందించిన పవన్‌ కల్యాణ్‌..’ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? అని నిలదీశారు.. పవన్ కల్యాణ్‌ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? అని ప్రశ్నించారు. కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ల దగ్గర ఇవ్వొచ్చు అని సూచించారు. ఇక, వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి” అంటూ దుయ్యబట్టారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

ఇదే సమయంలో.. పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి.. అంటూ జనసైనికులు పిలుపునిచ్చార పవన్‌ కల్యాణ్‌.. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళండి.. పింఛన్ ఇప్పించండి. ఆ తరవాత ఇంటి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం అందించగలరు. జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టిడిపి, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను అంటూ ట్వీట్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌.