Leading News Portal in Telugu

Weather Update: తెలంగాణకు చల్లని కబురు.. రెండు రోజుల వానలు..



Rain

భారత వాతావరణశాఖ తెలంగాణ రాష్ర్టానికి చల్లని కబురు చెప్పింది. త్వరలో రాష్ట్రానికి వర్ష సూచన ఉందని.. కాస్త ఉష్ణతాపం నుంచి రిలీఫ్ దొరుకుతుందని తెలిపింది. రాష్ట్రంలో 6వ తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.. 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న (బుధవారం) నమోదు అయింది.

Read Also: DC vs KKR: 166 పరుగులకే ఆలౌట్.. ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం

కాగా, ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్‌ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. నిజామాబాద్‌లో 41.2, ఆదిలాబాద్‌లో 41.3, మెదక్‌, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాడ్పులు ఎక్కువగానే ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాడ్పులు ఉండే ఛాన్స్ ఉందని పేర్కొనింది. సాధారణం కంటే 5-8 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.