Leading News Portal in Telugu

Billionaire Barber: సింగల్ పేమెంట్.. ఒకేసారి 3 బెంజ్ కార్లు కొన్న బిలియనీర్ బార్బర్..!



6

బార్బర్ అంటే మామూలుగా ఒక సెలూన్ షాప్ లో ఉండి వచ్చి పోయే కస్టమర్స్ కి షేవింగ్, కటింగ్ చేస్తూ సాదాసీదాగా జీవనం కోసం సాగించి వాడిగానే అందరూ చూస్తారు. కాకపోతే బెంగళూరుకు చెందిన ఓ బార్బర్ బిలినియర్ గా మారాడంటే మీరు నమ్ముతారా..? అవునండి బెంగళూరులో చాలామంది రమేష్ బాబు అంటే పెద్దగా తెలియదు. అయితే బిలీనియర్ బార్బర్ రమేష్ బాబు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇకపోతే ఈయన చిన్నతనం నుండి కాస్త కష్టాలలో జీవనం కొనసాగిస్తూ చివరికి బిలీనియర్ గా మారాడు. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

ఇదివరకు కార్ అంటే విలాసవంతమైన వస్తువులలో ఒకటిగా ఉండేది. కాకపోతే రానురాను కాలం మారేకొద్ది కార్ అనేది కనీసంగా మారిపోయింది. ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలలో కార్లకు డిమాండ్ ఏమ క్రేజీగా మారిపోయింది. అందుకు తగ్గటే కారు సంస్థలు ధరలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. లగ్జరీ కార్లు మినహాయించి మిగతా కార్ల ధరలు మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండడంతో ఈమధ్య కారులను కొనుగోలు చేయడంలో భారతీయులు ఎక్కువ ఆసక్తి చెబుతున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే మార్కెట్లోకి వస్తున్న కొత్త లగ్జరీకారులను చూస్తూ వాటిలో ఒకటిని తమ సొంత కారుగా చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కొందరు సెలబ్రిటీలు కార్ల కొనుగోలు హాబీగా మార్చుకున్నారు.

Also read: Raviteja: ఏం జరిగినా మాస్ మహారాజ్ మారడు.. ఇదిగో ప్రూఫ్..

ఇక మరోవైపు బిలియనీర్ బార్బర్ రమేష్ బాబు గురించి చూస్తే.. తన చిన్నతనంలో ఆయన తండ్రి బార్బర్ గా జీవనం కొనసాగిస్తుండేవాడు. ఆయనకు ఏడు సంవత్సరాల సమయంలో తన తండ్రి అకాల మరణం చెందగా తన తల్లి వద్దనే ఉంటూ జీవనం కొనసాగించాడు. పదో తరగతిలో విద్యను మానేసి పూర్తిగా తన తండ్రి నిర్వహించే కులవృత్తిలోని కొనసాగాడు. ఓవైపు ఇలా ఉండగా మరోవైపు.. 2004లో రమేష్ ప్రభుత్వ సహాయంతో రమేష్ మొదటగా ఒక కారు తో ట్రావెల్స్ వ్యాపారం మొదలుపెట్టి., అది కాస్త లాభంగా ఉండడంతో అతి కొద్ది సమయంలోనే ప్రభుత్వ సహాయంతో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ను లాంచ్ చేసి లగ్జరీ కారు రెంటల్ అండ్ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారం లోకి అంచలంచలుగా ఎదిగాడు. ప్రస్తుతం ఈయన వద్ద 300 మందికి పైగా పని చేస్తున్నారంటే మీరు నమ్ముతారా. ఇక ఈయన కొన్ని ఏళ్ల క్రితం రోల్స్ రాయిస్ గోస్ట్ కారును కొని అప్పుడు వార్తల్లో మొదటగా నిలిచాడు.

Also read: Shreyas Iyer: 272 స్కోర్ చేస్తామని అస్సలు అనుకోలేదు.. ఏమాత్రం బాధ లేదు: శ్రేయస్‌ అయ్యర్

ఈయన దగ్గర అనేక లగ్జరీ కార్స్ ఉన్నాయీ. ఈయన కస్టమర్స్ అందరూ సెలబ్రిటీసే. ఇకపోతే తాజాగా ఈయన మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ సెడాన్లను తన గ్యారేజీలోకి తీసుకోవచ్చాడు. ఈ కార్ ధర ఒక్కొక్కటి 72.8 లక్షలుగా ఉండగా.. మొత్తంగా మూడు కార్లకు 2.2 కోట్లను వెచ్చించి కొన్నాడు. ఇక ఈయనకు బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి వారితోపాటు, ప్రముఖ రాజకీయ నాయకులు ధనిక పారిశ్రామికవేత్తలు అందరూ ఈయన కస్టమర్స్.