Leading News Portal in Telugu

KRMB Meeting: నేడు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం..



Krmd Meeting

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు త్రిమెన్‌ కమిటీ నేడు (గురువారం) ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. కమిటీలో బోర్డు మెంబర్‌ సెక్రటరీ, ఇరు రాష్ర్టాలు ఈఏన్సీలు సభ్యులుగా ఉండనున్నారు. త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లోనే భేటీ అయింది.. రెండు రిజర్వాయర్లలో దాదాపు 82కి పైగా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలను కేఆర్ఎంబీ కేటాయించింది. మిగిలిన 2 టీఎంసీలను మే నెల తర్వాత భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగించాలని చెప్పింది. అయితే, తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి నీటిని వినియోగించుకుంది.

Read Also: IPL 2024: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. సూర్య వచ్చేస్తున్నాడు!

కాగా, ఏపీ తన కోటాలో 42 టీఎంసీలను వినియోగించుకోగా, మరో 3 టీఎంసీలు మిగిలి ఉన్నాయని కేఆర్ఎంబీకి తెలిపింది. అయితే, ఏప్రిల్‌లో మరో 5 టీఎంసీలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ కేఆర్‌ఎంబీకి లేటర్ రాసింది. కోటాకు మించి 2టీఎంసీలను కోరుతుంది. ఈ నేపథ్యంలో త్రిమెన్‌ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఇక, కేఆర్ఎంబీ నిర్వహించే త్రీ మెంబర్ కమిటీ సమావేశానికి హాజరుకాలేమని రెండు రాష్ట్రాలు కేఆర్​ఎంబీకి లెటర్ రాసినట్టు సమాచారం. తెలంగాణ ఈఎన్​సీ (జనరల్) లీవ్ ​లో ఉండడంతో ఈ మీటింగ్ కు రాలేకపోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ నుంచి అధికారులు రాకపోవడంతోతాము కూడా సమావేశానికి అటెండ్ కావడం లేదని కేఆర్​ఎంబీకి ఏపీ కూడా లేఖ రాసినట్టు సమాచారం. రెండు రాష్ట్రాలు రాసిన లేఖలపై కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్​ఎంబీ అధికారులు లెటర్ రాసే అవకాశం ఉంది.