KatamReddy Vishnuvardhan Reddy: టీడీపీకి షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే

KatamReddy Vishnuvardhan Reddy: సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. టికెట్లు దక్కక కొందరు.. అవకాశాలు రాక మరికొందరు.. సమయం చూసి దెబ్బ కొట్టేవారు ఇంకొందరు.. ఇలా ఆ పార్టీ నుంచి.. ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి వెళ్లి కండువాకప్పుకుంటున్నారు.. తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగుతుండగా.. ఎద్దలచెరువు వద్ద మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి.. తన అనుచరులు, పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: Ramayana – Ranbir Kapoor: వైరల్ గా మారిన రణబీర్ కపూర్ ‘రామాయణ’ సెట్స్ పిక్స్..!
కాగా, 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేశారు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే, ఈ సారి టీడీపీ టికెట్ ఆశించిన విష్ణువర్ధన్‌రెడ్డికి టికెట్ రాకపోవడంతో.. క్రమంగా టీడీపీకి దూరమయ్యారు.. వారం రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.. తన అనుచరులు, పార్టీ కార్యకర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్బంగా కార్యకర్తల సలహాలు ,సూచనలు తీసుకొని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో YSR పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.. దానికి అనుగుణంగానే నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి.