Leading News Portal in Telugu

Byjus Raveendran: ఏడాది క్రితం రూ.17వేల కోట్లు.. ఇప్పుడు జీరో.. బైజూస్‌ రవీంద్రన్‌..!



13

రెండేళ్ల కిందటివరకు కూడా ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్‌., ఇప్పుడు మాత్రం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. కంపెనీ ప్రస్తుతం తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. బైజూస్‌ సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందంటే నమ్మండి. ఇదివరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న తన ఇంటిని కూడా తాకట్టు పెట్టేందుకు బైజూస్‌ అధినేత రవీంద్రన్‌ సిద్ధపడ్డాడు. వాటితోపాటు అనేక విలువైన ఆస్తులను కూడా అమ్ముకున్నట్లు సమాచారం.

Also Read: Kishan Reddy: హైదరాబాద్లో ఎప్పుడు 40 శాతానికి మించి ఓటింగ్ నమోదు కాదు..

ఇకపోతే గత సంవత్సరం ఇదే సమయానికి ఆయనకు వేల కోట్లు ఉన్నాయి. అది కూడా 17 వేల కోట్లు విలువచేసే ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రపంచ కుబేరుల జాబితా ఫోర్బ్స్‌ లో కూడా ఆయనకు స్థానం దక్కింది. అయితే రోజులన్నీ మనవి కాదు అన్నట్లుగా.. ఒక్క సంవత్సరంలోనే ఆయన పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోట్ల అధిపతి నుండి ఒక్క రూపాయి కూడా చేతిలో లేని పరిస్థితికి ఆయన చేరడం నిజంగా బాధపడాల్సిన విషయం. తాజాగా విడుదలైన ఫోర్బ్స్‌ జాబితాలో రవీంద్రనాథ్ నికర విలువ ఏకంగా ‘0’ కి పడిపోయినట్లు తెలిపింది.

Also Read: MP Navneet Kaur: ఎంపీ నవనీత్ కేసులో నేడు సుప్రీం తీర్పు..!

రవీంద్రన్ 2011లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అప్ బైజూస్ ను స్థాపించిన విషయం మనకు వివిధమే. ఆన్లైన్ లో విద్య బోధన గురించి ఈ కంపెనీ తొలి రోజుల్లో మంచి ఆదరణ లభించకపోయిన ఆ తర్వాత కరోనా కారణంతో ఈ సంస్థ దశ పూర్తిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉండి బైజుస్ లో ఉండే కంటెంట్ కు అలవాటు పడిపోయారు. దీంతో బైజూస్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ కంపెనీ విలువ 2022లో ఏకంగా 22 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ ఒక్కసారిగా ప్రపంచ కుబేరుల లిస్టులో చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం కేవలం ఒక్క బిలియన్ కన్నా తక్కువకు కంపెనీ వాల్యూ పడిపోయినట్లు ఫోర్బ్స్‌ తన తాజా రిపోర్ట్ లో తెలిపింది