Leading News Portal in Telugu

Arvind Kejriwal: తాను జైల్లో ఉన్న ఢిల్లీ ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదు.. కేజ్రీవాల్ సందేశాన్ని తెలిపిన భార్య..!



15

ప్రస్తుతం జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజగా తన సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ గురువారం ఢిల్లీ సీఎం నుంచి వచ్చిన సందేశాన్ని ఆప్ ఎమ్మెల్యేలకు వినిపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఎమ్మెల్యేలందరికీ ఓ సందేశం పంపారు. తాను జైల్లో ఉన్నాను కాబట్టి.. ఢిల్లీ రాష్ట్ర ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదని., అందుకని రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే ప్రతిరోజూ తమ ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజల సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించాలని కోరాడు. ఎమ్మెల్యేలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి., వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని సోషల్ మీడియా లో ఢిల్లీ సీఎం సందేశాన్ని భార్య సునీతా కేజ్రీవాల్ చెప్పారు.

Also Read: Konda Vishweshwar Reddy: నా ప్రత్యర్థి ఎవరో నాకు ఇప్పటికీ తెలియడం లేదు..

అంతేకాకుండా., కేవలం ప్రభుత్వ సంబంధిత సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాక., ప్రజలు ఎదుర్కొంటున్న మరేమైనా సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన కొరారు. ఢిల్లీలో ఉన్న 2 కోట్ల మంది ప్రజలు నా కుటుంబం, నా కుటుంబంలో ఎవరూ ఏ కారణం చేతనైనా అసంతృప్తి చెందకూడదని కోరుకుంటున్నట్లు ఆవిడ తెలిపింది. ప్రతి ఒక్కరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు, జై హింద్.. అంటూ సునీతా కేజ్రీవాల్ ఎక్స్‌ ఖాతాలో ఢిల్లీ ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించింది.

Also Read: Thummala: గత పదేళ్లుగా రుణమాఫీ చేయనందుకు బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి..

ఇక మరోవైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ 6 నెలల తర్వాత., తీహార్ జైలు నుంచి బయటకు రాగా, సునీతా కేజ్రీవాల్‌ ను ఆమె నివాసంలో కలిసిన తర్వాత ఈ ప్రకటన రావడం అందరిని ఆలోచింపచేసేలా ఉంది. ఎంపీ సంజయ్ సింగ్ ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ కింద తీహార్ జైలులోనే ఉండాల్సి వస్తుంది.