Leading News Portal in Telugu

Bhatti Vikramarka : మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాల ఇచ్చాం



Bhatti Vikramarka

రాష్ట్రంలో ప్రశ్నించాలంటే భయం రాయాలంటే భయం ఉండేది… అటువంటి ప్రభుత్వం ఇప్పుడు లేదని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన గారెంటీలని అందిస్తున్నామని, మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాల ఇచ్చామన్నారు. నేతలు చేసిన వాగ్దానాలు మార్చి పోయారని లేని పోని అభాండాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరెంట్ పొకపోయిన పోయినట్లుగా ప్రభుత్వం పై విమర్శలు చేసి దిగజారుడు తనం బయట పడిందని ఆయన వ్యాఖ్యానించారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఏర్పాట్లు విద్యుత్ రంగంలో ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ వల్ల కొన్నింటిని ప్రకటించడం లేదని, సీఎం రేవంత్, మంత్రి వర్గ సహచరులు 24 గంటలు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టము.. పెట్టలేమని ఆయన తెలిపారు. ఢిల్లీకి వెళ్ళేది రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్ళామని, 50 వేల కోట్ల విలువ చేసే కోల్ మైన్ ల గురించి పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదన్నారు భట్టి విక్రమార్క.

MA Siddiqui : వర్ఫ్ బోర్డ్ భూములను పరిరక్షణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

మూడు నెలల్లో కోట్లాది రూపాయల నిధులు తెచ్చుకున్నామని, కేసీఆర్ మాదిరిగా ఢిల్లీకి వెళ్లి రాజకీయాలు చేయలేదని ఆయన తెలిపారు. దేశానికి నాయకుడిగా కావాలని ప్రధాని కావాలని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. సింగరేణి ktps కు చెందిన సమస్యలను పరిష్కరించడం చేశామని, మంత్రులకు సంబంధం లేకుండా ఎటువంటి నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. తెలంగాణ మోడల్.దేశ వ్యాపితంగా ఉండాలన్నదే మా కోరిక అని భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోందని, దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీ లను తుక్కుగూడ కేంద్రంగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వము సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకటిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కరువు కావడానికి టీఆర్ఎస్ కారణం అయ్యిందని, జలవనరుల ఖాళీ చేసింది గత ప్రభుత్వం పొలాల్లో పంటలు లేకపోయినప్పటికీ సాగర్ ను ఖాళీ చేసింది గత ప్రభుత్వమన్నారు. త్రాగడానికి.నీళ్ళు లేకుండా గత ప్రభుత్వం విధానాలే కారణమని, యుద్ద ప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నామన్నారు.

Amritha Aiyer : ట్రెండీ వేర్ లో హనుమాన్ బ్యూటీ అందాలు వేరే లెవల్..