Leading News Portal in Telugu

Iran: భద్రతా బలగాలపై సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ దాడి.. 27 మంది మృతి..



Iran

Iran: ఇరాన్ భద్రతా బలగాలే టార్గెట్‌గా సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ దాడులకు తెగబడింది. పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లోని సిస్తాన్-బలూచిస్తాన్‌లోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై జైష్ అల్-అద్ల్ దాడికి చేసింది. ఈ దాడిలో 11 మంది ఇరాన్ భద్రతా దళ సభ్యులు మరణించగా.. 16 మంది ఇతరులు చనిపోయినట్లుగా ఇరాన్ స్టేట్ మీడియా గురువారం తెలిపింది. మరో 11 మంది భద్రతా అధికారులు గాయపడ్డారు. జైష్ అల్-అద్ల్ ఉగ్రసంస్థ భద్రతా బలగాలపై రాత్రిపూట దాడులు జరిపింది. చబహార్, రాస్క్ పట్టణాలలో ఈ దాడులు జరిగినట్లుగా స్టేట్ టీవీ తెలిపింది.

Read Also: Vegetarian Thali: వెజ్ థాలీ ధరలు పెరిగాయి, నాన్-వెజ్ థాలీ ధరలు తగ్గాయి.. కారణం ఇదే..

చాబహార్, రాస్క్ లోని గార్డ్స్ ప్రధాన కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడంలో ఉగ్రవాదులు విఫలమయ్యారని ఇరాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ మజిద్ మిరాహ్మది తెలిపారు. షియా ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులో సున్నీ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇరాన్‌లో ఈ జాతుల మధ్య ఘర్షణల ఫలితంగా దాడులు జరుగుతున్నాయి. బలూచీలకు ఎక్కువ హక్కుల, మెరుగైన జీవన పరిస్థితులు కోరుకుంటున్నట్లు జైష్ అల్-అద్ల్ చెబుతోంది.

పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతంలో తరుచుగా ఉగ్రవాద సంస్థ, ఇరాన్ బలగాలకు మధ్య పోరాటం కొనసాగుతోంది. మాదకద్రవ్యాల రవాణా, సున్నీ మిలిటెంట్లను అడ్డుకోవడంతో దాడులు పెద్దవిగా మారుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మాదక ద్రవ్యాలు వెస్ట్రన్ దేశాలకు వెళ్లడానికి ఇరాన్ కీలకమైన రవాణా మార్గంగా ఉంది. డిసెంబర్ నెలలో ఇదే తీవ్రవాద సంస్థ రస్క్ పట్టణంలో ఒక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 11 మంది భద్రతా సిబ్బందిని చంపింది. ఆ తర్వాత ఇరాన్ పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న తీవ్రవాద స్థావరాలపై రాకెట్లతో దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారంగా పాకిస్తాన్, ఇరాన్‌పై దాడి చేసింది.