
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఫ్లోరిడాలో కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాప్ట్‌వేర్ కుటుంబం తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో పసికందు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు ప్రమాదానికి గురైన వెంటనే స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాధితులను తల్లాహస్సీలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శిశువు మరణించింది. మిగతా ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణకు చెందిన భార్యాభర్తలు సుశీల్, అనూషగా గుర్తించారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు.
కొమ్మారెడ్డి సుశీల్, బొమ్మిడి అనూషల పెద్ద కుమారుడు అద్వైత్(11)ను ఆస్పత్రిలో చూపించి.. తిరిగి ఇంటికి కారులో వెళ్తుండగా మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు, వారి పెద్ద కుమారుడు తీవ్రంగా గాయపడి అలబామాలోని దోథాన్‌లోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి సుశీల్, కుమారుడు అద్వైత్ ఐసీయూలో ఉన్నారు. తల్లి అనూషకు ఎడమ కాలు, ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. వారి యొక్క చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది.
ఇది కూడా చదవండి:Rahul Gandhi: ఆలోచించండి, అర్థం చేసుకోండి.. ఓటర్లను కోరిన రాహుల్ గాంధీ..