Leading News Portal in Telugu

బొగ్గుల మీద వండిన వంటలను తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా?



Tasty And Spicy Grilled Chicken Leg With Spices On Grill

ఆరోజుల్లో కట్టెల పోయి మీద వంటలను వండుకొనేవారు.. కానీ ఇప్పుడు అదే విధంగా బొగ్గుల మీద కాల్చుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇప్పుడు ఇలా వంట చేసి తినడం ఓ ట్రెండ్‌​ అయిపోయింది. ముఖ్యంగా మట్టి పాత్రల్లో తినడం మరింత ట్రెండ్‌గా ఉందని చెప్పొచ్చు. మట్టికుండల్లో తినడం వరకు ఓకే .. కానీ బొగ్గుల మీద కాల్చుకొని తినడం వల్ల ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. బొగ్గుల మీద కాల్చుకొనే వంటలను తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రిల్స్ మీద కాల్చుకొని తినడం అంటే చాలా మందికి ఇష్టం.. మామూలు వాటికన్నా కూడా పొయ్యి మీద కాల్చిన వాటి కోసం డబ్బులు ఎక్కువైన ఖర్చు పెడుతున్నారు..వాటివల్ల క్యాన్సర్‌ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకనే ఆ రోజుల్లో బొగ్గుల పొయ్యి మీద వంటలు మానేశారని అన్నారు.. అలాగే పొయ్యి మీద చేసే వంటలను తినడం వల్ల శ్వాస సంబందించిన వ్యాధులు వస్తున్నాయని అందుకు వంట గ్యాస్ లు అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు..

ఈ మధ్య మన దేశంలో కూడా ఇక్కువగా క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. యువత క్యాన్సర్ బారిన పడటానికి కారణం కూడా లేకపోలేదు.. జంక్ ఫుడ్స్ తినడం, కాల్చిన ఆహారాలను తినడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.. వంటల్లో వాడే మసాలాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎక్కువగా ఉడికించిన కూరగాయలను తీసుకోవడం మంచిది.. అలాగే మాంసాన్ని కూడా బాగా ఉడికించి తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..