Leading News Portal in Telugu

Nandyal Crime: నంద్యాలలో దారుణ హత్య.. నిద్రలో ఉండగానే గొంతుకోసి చంపేశారు..!



Crime

Nandyal Crime: నంద్యాలలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. దేవనగర్ లో షేక్ షమీర్ అనే యువకుడి గొంతుకోసి ప్రాణాలు తీశారు.. నంద్యాలలోని దర్గా సెంటర్ లో చికెన్ పకోడా వ్యాపారం నిర్వహిస్తున్నాడు మృతుడు షేక్ షమీర్.. అయితే, వేసవి కావడంతో ఉక్కపోత భరించలేక రాత్రి ఇంటి పైకప్పు పై నిద్రించాడు షమీర్.. కానీ, అర్ధరాత్రి దాటాక ఆగంతకులు ఇంటి పై కప్పుపైకి వెళ్లి.. షమీర్‌ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.. ఇక, తెల్లవారుజామున షేక్ సమీర్ మృతదేహాన్ని చూసి షాక్‌ తిన్న కుటుంబ సభ్యులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు.. మరోవైపు.. ఈ హత్యపై కేసు నమోదు చేసిన నంద్యాల 3 టౌన్‌ పోలీసులు.. విచారణ చేపట్టారు.. అయితే, వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు నంద్యాల పోలీసులు.

Read Also: Amritpal Singh: వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ తల్లి అరెస్ట్.. కారణం ఇదే..