
Maheshwar Reddy: సోనియా గాంధీనీ బలి దేవత అని ఇప్పుడు దేవత అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరువుతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయన్నారు. రుణమాఫీపై ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందని ఆరోపించారు. రైతు బంధుకి ఇవ్వాల్సిన 7 వేల కోట్లు మళ్లించారని మండిపడ్డారు. అవి ఎవరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చాక 17 వేల కోట్లు అప్పులు తెచ్చారని తెలిపారు. నాలుగు నెలల్లో 40 వేల కోట్ల రెవెన్యూ వచ్చి ఉంటుందన్నారు. మొత్తం 57 వేల కోట్లు దేనికీ ఖర్చు చేశారన్నారు. ఒక్క పథకాన్ని అమలు చేయలేదన్నారు. ఈ డబ్బు అంతా R టాక్స్, B టాక్స్ కోసమే ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి పాలన పైన పట్టు రాలేదన్నారు.
Read also: CM YS Jagan: చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్టే.. మన ప్రభుత్వంతో వచ్చిన మార్పును చూడండి..
డిఫాక్టో సీఎం, శ్రీధర్ బాబు SRSP నుండి 8 టీఎంసీల నీళ్ళు అక్రమంగా తరలించుకుపోయారన్నారు. ఇదేనా మీ వాటర్ మేనేజ్మెంట్ అని ప్రశ్నించారు. పంట నష్ట సహాయం కింద 10 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి సోనియా గాంధీనీ బలి దేవత అని ఇప్పుడు దేవత అని అంటున్నారని తెలిపారు. మోడీ నీ బడే భాయ్ అని ఇప్పుడు నమ్మించి మోసం చేసే వ్యక్తి అని అంటున్నారని తెలిపారు. నీకు మోడీ నీ అనే హక్కు లేదని హెచ్చరించారు. ఎన్నికల టైమ్ లో ఏదో మాట ఇచ్చి ఓట్లు దండు కునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. హామీలు అన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో రేవంత్ రెడ్డీ చెప్పించారని తెలిపారు. అవి నేను చెప్పలేదని తెలివిగా రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారని తెలిపారు. నాకు సంబంధం లేదని ఏదో ఒక రోజు బయట పడతారన్నారు.
Nizamabad: ప్రాణం తీసిన కారు.. ఊపిరాడక బాలుడు మృతి