
ఈరోజుల్లో జనాలకు ఆరోగ్యం పై శ్రద్ద తగ్గింది.. ఆరోగ్యాన్ని ఇచ్చేవాటిని కాకుండా నోటికి రుచిగా ఉండేవాటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. మనం బయట ఆహారాన్ని తినకుండా ఇంట్లో ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు వైద్యులు.. అలాకాకుండా బయట తింటే కోరి మరి అనారోగ్య సమస్యలను తెచ్చుకున్న వాళ్ళం అవుతారు.. మరమరాలు అంటే ఏపీ వారికి చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఈ మరమరలను ఒక్కోచోట ఒక్కో విధంగా పిలుస్తారు..
వీటితో రకరకాలుగా చేసుకొని తింటారు.. మాములుగా చేసుకొనే టిఫిన్స్ కన్నా వీటిని చేసుకొని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరమరాలు తినడం వల్ల విటమిన్ డి, విటమిన్ బి లాంటి మూలకాలు శరీరానికి లభిస్తాయి. ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.. ఎన్నో రోగాలను నయం చెయ్యడంలో ఇవి సహాయ పడతాయి..
ముఖ్యంగా బీపి, షుగర్ ఉన్న వాళ్లు కూడా వీటిని తినొచ్చు.. నిమ్మకాయ రసం కలిపి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థ మెరువవుతుందట.. అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగి ఉంటారు. దాంతో తిండి పై శ్రద్ద చూపించారు.. అలా బరువును సులువుగా తగ్గుతారు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.