Leading News Portal in Telugu

Kadapa Crime: కన్న కొడుకును కొట్టి చంపిన తండ్రి..



Crime

Kadapa Crime: కడప జిల్లా ప్రొద్దుటూరులో కన్న కొడుకునే కొట్టి చంపాడో వ్యక్తి.. మతి స్థిమితం లేని కొడుకును చూసుకోవడానికి భారంగా మారి.. బాలుడి కన్నతల్లి కన్నుమూయడంతో.. మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి.. భార్య పోరే మరి.. కొడుకును సాకడమే భారంగా భావించాడో తెలియదు కానీ.. కొడుకు ముస్తహీం(5) ను కొట్టి చంపేశారు తండ్రి ఇమ్రాన్. ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.. చిన్నప్పుడు నుంచి మతి స్థిమితం లేక ఇంట్లోనే ఉండేవాడు ముస్తహీం. ఇక, ముస్తహీం పుట్టినప్పుడే తల్లి చనిపోవడంతో మరో వివాహాం చేసుకున్నాడు తండ్రి ఇమ్రాన్.. అయితే, సోమవారం ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు బాలుడు.. అతడి ఒంటిపై రక్తం, గాయాలు కనబడడంతో.. అనుమానంతో పోలీసులకు సమాచారం చేరవేశారు స్థానికులు.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తండ్రి ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తన కొడుకును తానే కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు ఇమ్రాన్…

Read Also: Youtube: ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు.. 2.25 మిలియన్ వీడియోలు తొలగింపు