Suspension: సంచలన నిర్ణయం.. ఒకేసారి 106 మంది ప్రభుత్వ సిబ్బంది పై సస్పెన్షన్ వేటేసిన సిద్దిపేట కలెక్టర్..!

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి ఏర్పాటు చేసిన సభకు హాజరైన నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7 ఆదివారం నాడు సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ సిబ్బందితో కలిసి వెంకట్రామిరెడ్డి ఓ సభను ఏర్పాటు చేసారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు, విషయాన్నీ కాస్త అధికారులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Amanchi Krishna Mohan: సీఎం జగన్కు నాకు ఎలాంటి గ్యాప్ లేదు.. కానీ, కాంగ్రెస్లోకి వెళ్తున్నా..
ఇందుకు సంబంధించి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సీఈవో వికాస్ రాజ్ కు పక్కా ఆధారాలలో సహా ఫిర్యాదు అందించారు. జరిగిన ఘటన పై విచారణ జరపాలని సిద్దిపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారైన మను చౌదరిని సీఈవో ఆదేశించారు. ఈ ఉదంతంపై విచారణ చేపట్టిన కలెక్టర్ 106 మంది ప్రభుత్వ సిబ్బంది ఈ సభలో పాల్గొన్నట్లు వారు గుర్తించారు. దాంతో సభలో పాల్గొన్న 106 మందిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Also Read:Sree Vishnu New Movie: పండగ వేళ శ్రీవిష్ణు కొత్త సినిమా ఆరంభం!
సస్పెండ్ అయినా ఉద్యోగుల వివరాలు చూస్తే.. సెర్ప్ ఉద్యోగులు 38 మంది ఉండగా వారిలో ఏపీఎంలు-14, సీసీలు-18, వీవోఏలు-4, సీఓ-1, సీబీ ఆడిటర్స్-1 లు ఉన్నారు. అలాగే ఈజీఎస్ ఉద్యోగులు – 68 మంది ఉండగా వారిలో ఏపీవోలు-4, ఈసీలు -7, టీఏలు-38, సీఓలు-18, ఎఫ్ఎ-1 లు ఉన్నారు. చుడాలిమరి ముందుముందు ఈ విషయం పై ఎలాంటి రాజకీయ పరిమాణాలు చోటు చేసుకుంటాయో.