
సిద్ధరామయ్యకు ఊహించని పరిమాణం.. తుపాకీతో వ్యక్తి హల్చల్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం ఎదురైంది. వాహనం పైనుంచి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్న సిద్ధరామయ్య దగ్గరకు ఓ వ్యక్తి నడుముకు తుపాకీ పెట్టుకుని వెళ్లి పూల దండ వేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన కార్యకర్తలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాహనంపై ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, పార్టీ అభ్యర్థులకు పూలదండలు వేసి హల్చల్ చేశాడు. అనంతరం ఆ వ్యక్తి వాహనం దిగి కిందికి వెళ్తుండగా అతడి దగ్గర తుపాకీ చూసి సిద్ధరామయ్య, నాయకులు అవాక్కయ్యారు.
బెంగళూరులోని విల్సన్ గార్డెన్ సమీపంలో రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి సౌమ్య రెడ్డి తరఫును సీఎం సిద్ధరామయ్య ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ప్రచార వాహనం పైకి ఎక్కిన వ్యక్తి.. కాంగ్రెస్ నినాదాలు చేస్తూ సిద్ధరామయ్యకు, మంత్రి రామలింగారెడ్డికి, సౌమ్య రెడ్డికి పూల దండలు వేశాడు. కానీ నడుము దగ్గర తుపాకీ ఉందన్న సంగతిని ముఖ్యమంత్రి గానీ.. నాయకులు గానీ గుర్తించలేకపోయారు. వాహనం దిగితుండగా గమనించి ఝలక్‌కు గురయ్యారు. అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
మూడు సినిమాలు లైన్లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇక రచ్చ రచ్చే!
నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా 2014లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన స్పీడున్నోడు, సాక్షం, అల్లుడు అదుర్స్, సీత, కవచం వంటి చిత్రాలు నిరాశపరిచాయి. మధ్యలో జయ జానకీ నాయక, రాక్షసుడు సినిమాలు హిట్లుగా నిలిచాయి. ఇక ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ని బాలీవుడ్లో రీమేక్ చేయగా.. ఘోర పరాజయాన్ని చవి చూసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు పూర్తైంది. ప్రస్తుతం అతడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
పీసీసీ చీఫ్ పదవిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారని.. అధికారం కోసం అడ్డదారులు తొక్కరని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ, అమిత్ షా విధానమని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అవగాహన లేదని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ ఓ సారి బీజేపీ అంటారని, ఇంకోసారి కాంగ్రెస్ అంటారని.. ఆయన బతుకుదెరువు కోసం సర్వే సంస్థను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని పీకే చెప్పారని.. కానీ కాంగ్రెస్ గెలిచిందన్నారు.
పిఠాపురం జనసేన కార్యాలయం నా స్వగృహం.. విజయకేతనం ఎగరవేస్తున్నాం..
పిఠాపురం జనసేన కార్యాలయమే నా స్వగృహం.. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో విజయకేతనం ఎగరవేస్తున్నామని తెలిపారు జనసేన అధినేత, పిఠాపురం జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో తన సోదరుడు నాగబాబు, జనసేన నేతలతో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించారు.. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.. ఇక, వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు.. క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది ప్రజలకు మేలు జరగాలని.. రైతులు, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలన్నారు. ఇక, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు పవన్ కల్యాణ్.
ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. ఉగాది రోజు ప్రజలు సంకల్పం తీసుకోవాలి..
ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. ఇదే నినాదంతో పని చేయాలి.. తెలుగు జాతికి పూర్వ వైభవం వచ్చేలా ఉగాది రోజున ప్రజలు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్ నిర్మాణం జరగాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని కూటమిగా ఏర్పడ్డాం అన్నారు.. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సాయం అవసరం.. వచ్చేది కూటమి ప్రభుత్వమే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. సమాజంలో సైకో జగనుకు స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే. సూపర్ సిక్స్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మన మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి డిపాజిట్లు రావని.. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం అని ప్రకటించారు.
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ సమయం మార్పు.. ఎప్పుడంటే..!
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో మార్పు జరిగింది. తొలుత మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అయితే ఈ సమాయాన్ని మధ్యాహ్నం 3:15 గంటలకు మార్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం 3:15 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించనున్నారు. అయితే న్యాయస్థానం జడ్జిమెంట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బెయిల్ వస్తుందన్న ఆశతో ఆప్ నేతలు ఎదురుచూస్తున్నారు.
వాలంటీర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్..
పెన్షన్లు పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు వృద్ధులను ఎండలో నిలబెట్టారు.. ఇక, వాలంటీర్ల వ్యవస్థే లేదంట అనే వార్త బయటకు వచ్చింది.. వాలంటీర్ల వ్యవస్ఖను రద్దు చేస్తూ రహస్య జీవో ఏమైనా తెచ్చారా..? అని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థపై తొలి సంతకం అంటే.. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్ఖ లేనట్టేగా..? అని పేర్కొన్నారు. సీఎం జగన్ వాలంటీర్లను మోసం చేస్తున్నారు.. జగన్ ఎంత స్వార్ధపరుడో వాలంటీర్లు అర్ధం చేసుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం.. వారికి 10 వేల రూపాయల గౌరవ భృతిని కల్పిస్తాం అని చంద్రబాబు వెల్లడించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడి పని చేస్తా..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఉగాది శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న తెలుగు వారి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడునీ కోరుకున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, పశ్చిమ నియోజకవర్గం ప్రజల కోసం కష్టపడి పని చేస్తాను అని చెప్పారు. ప్రజలు దగ్గర నుంచి రెస్పాన్స్ బాగా వస్తుంది.. అనేక మౌలిక సదుపాయాలు చేయవలసిన అవసరం ఉంది ఈ నియోజకవర్గంలో అని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు.
సమాజాన్ని చీల్చడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో నిజామాబాద్‌లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని చీల్చడమే లక్ష్యంగా బిజెపి మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తాం అనడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. మోడీకి ఆదాని, అంబానీ అండ రాహుల్ గాంధి కి ఎవరు ఉన్నారని, దేశ సమగ్రత, దేశ ఐక్యతను కాపాడింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.
48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్..!
వివిధ ప్రాంతాల మధ్య 48 వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. దీని ప్రకారం, సికింద్రాబాద్ – నాగర్సోల్ (07517) సర్వీస్ ఏప్రిల్ 17 మరియు మే 29 మధ్య నడుస్తుంది మరియు నాగర్సోల్ – సికింద్రాబాద్ (07518) సర్వీస్ ఏప్రిల్ 18 మరియు మే 30 మధ్య నడుస్తుంది. ఇతర వేసవి ప్రత్యేక రైళ్లలో హైదరాబాద్ మరియు కటక్ మధ్య మంగళవారం అంటే ఏప్రిల్ 16, 23 మరియు 30 తేదీలలో రైలు నం. 07165, కటక్ మరియు హైదరాబాద్ మధ్య బుధవారం అంటే ఏప్రిల్ 17, 24 మరియు మే 1 తేదీలలో నడుస్తుంది.
ఇదిలా ఉండగా వేసవి ప్రత్యేక రైలు నంబర్. 07123 మంగళవారం అంటే ఏప్రిల్ 16 మరియు 23 తేదీలలో సికింద్రాబాద్ మరియు ఉదయపూర్ మధ్య మరియు రైలు నెం. 07124 ఉదయపూర్ మరియు సికింద్రాబాద్ మధ్య శనివారం అంటే ఏప్రిల్ 20 మరియు 27 తేదీలలో నడుస్తుంది.
మార్గంలో, రైలు నెం. 07165/07166 హైదరాబాద్ – కటక్ – హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనంకపల్లి, దువ్వాడ, కొత్తవలస, శ్రీకాకుళం, వికాకుళం, పాలసీలలో ఆగుతాయి. , బెర్హంపూర్, ఖుర్దా రోడ్ మరియు భువనేశ్వర్ స్టేషన్లు రెండు దిశలలో ఉన్నాయి.