Leading News Portal in Telugu

PM Modi: మైనారిటీ శ‌రణార్ధుల‌కు భార‌త్ ఆశ్ర‌యం క‌ల్పిస్తుందంటున్న పీఎం మోడీ..!



8

ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిపోతుంది. దింతో లోక్ సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వారి నియోజవర్గాలలో పెద్దపెద్ద మీటింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకొని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నడుస్తోంది. ఇదిలా ఉంటే..

Also Read: Elections 2024: ఎన్నికల సంఘం నిర్ణయం.. ఇకపై అక్కడ ‘పోలింగ్‌’ వెహికిల్స్‌కు జీపీఎస్‌..!

ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించాయి. దాంతో సదురు అభ్యర్థులు వారి నియోజకవర్గం పెద్ద ఎత్తున ప్రసంగాలు చేస్తూ క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రచారంలో భాగంగా పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌మ‌ర్ధించారు. మైనారిటీ శ‌రణార్ధుల‌కు భార‌త్ ఆశ్ర‌యం క‌ల్పిస్తుంద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు.

Also Read: TDP: విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించిన టీడీపీ.. మొదటి డొనేషన్ ఎంతో తెలుసా..?

నేడు ఇదే స్ఫూర్తి, శ‌క్తితో మ‌నం అభివృద్ధి చెందిన దేశంగా భార‌త్‌ ను ఆవిష్క‌రించే దిశ‌గా తీర్మానం తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఇకపోతే అయోధ్య‌ నగరంలో రామాల‌య నిర్మాణాన్ని ప్ర‌శంసించిన నేత‌ల‌పై కాంగ్రెస్ పార్టీ బ‌హిష్క‌ర‌ణ వేటు వేస్తోంద‌ని ప్ర‌ధాని మోదీ చెప్పుకొచ్చారు. ప్ర‌పంచం నేడు ప‌లు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుండ‌గా.. భార‌తదేశం మాత్రం త‌న‌కు అసాధ్య‌మైన‌ది ఏమీ లేదంటూ చాటుతోంద‌ని అన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నేడు ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్‌ లో బీజేపీ అభ్య‌ర్ధి జితిన్ ప్ర‌సాదకు మ‌ద్ద‌తుగా జ‌రిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.