
డోర్ టూ డోర్ వెళ్లడం మా తొలి ప్రణాళిక అని, పెద్దగా సభలు పెట్టాలని అనుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. బీజేపీ గెలవాలి.. మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. పోలింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర అధ్యక్షుడిగా, నేను అభ్యర్ధిగా ఉన్నాను సో అందరిని కో ఆర్డినేట్ చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యల్లో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. #రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాన మంత్రి కాలేడని, ఒక ఏబుల్, స్టేబుల్, డెడికేషన్ ఉన్న లీడర్ షిప్ ఉందన్నారు. కాంగ్రెస్ గెలిచేదుందా. సచ్చేదుందా.? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పోవాలనుకుని కాంగ్రెస్ కి ఓటేశారని, కాంగ్రెస్ గెలవాలని కాంగ్రెస్ ని గెలిపించలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు సీట్లు రాకున్నా, BRS కు ఒక్క సీట్ రాకపోయిన ఏం కాదని, మోడీ చేసిన ట్రాక్ రికార్డ్ చూసి ప్రజలు ఓటేస్తారన్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జాతీయ నేతలు సభల్లో పాల్గొంటారని, నేను కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రచారం స్టార్ట్ చేస్తానని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే.. రేపు కిషన్ రెడ్డి సికింద్రాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో జీప్ యాత్ర చేయనున్నారు. ఉదయం 8.30 గంటలకు తార్నాక డివిజన్‌లో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం సత్యా నగర్. శ్రీపురి కాలనీ, చంద్రబాబు నగర్, ఇందిరానగర్. ఆయుర్వేద క్లినిక్ నల్ల పోచమ్మ టెంపుల్. బుక్ సెంటర్ టు హనుమాన్ టెంపుల్ కమాన్ వరకు జీపు యాత్ర చేస్తారు. అలాగే స్వామి వివేకానంద విగ్రహం లాలాపేట్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.