Leading News Portal in Telugu

Boney Kapoor: ప్రియమణి నడుం మీద చెయ్యేసిన బోనీ కపూర్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు



Boney Kapoor Trolled

Boney Kapoor Video:మంగళవారం సాయంత్రం ముంబైలో బి-టౌన్ సెలబ్స్ కోసం ‘మైదాన్’ స్క్రీనింగ్ జరిగింది. ఈ సమయంలో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన బోనీ కపూర్ సహా సినిమా యూనిట్ అంతా హాజరైంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నటి ప్రియమణి చీరలో అయితే చాలా అందంగా కనిపించింది. సరిగ్గా ఇదే సమయాల్లో బోనీ కపూర్ స్క్రీనింగ్ థియేటర్ వెలుపల అతిథులతో సంభాషిస్తూ కనిపించాడు. ఈ సమయంలో, బోనీ కపూర్ అప్పుడే వచ్చిన ప్రియమణికి స్వాగతం పలికారు. ఇక అదే సమయంలో ఫొటోగ్రాఫర్ లు ఫొటోలకు పోజులివ్వమని అడగగా పోజులిస్తుండగా, బోనీ ప్రియమణి, భుజం సహా నడుముపై చేయి వేయడం నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. ప్రియమణిని అనుచితంగా తాకినట్లు సోషల్ మీడియాలో బోనీ కపూర్ ను టార్గెట్ చేశారు.

Directors Day: దర్శకరత్న జయంతి… మే 4న హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో డైరెక్టర్స్ డే వేడుకలు

బోనీ కపూర్ చేసిన పనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ ఈ వ్యక్తి ఒక నటితో ఇలా ప్రవర్తిస్తాడని నేను ఊహించలేదని అన్నాడు. ఇక మరొకరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వ్యక్తి అంత నీచంగా ఎలా ఉంటాడు? ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అని రాసుకొచ్చారు. మరో నెటిజన్ నీ కపూర్ భారతదేశానికి చెందిన హార్వే వైన్‌స్టెయిన్ అని మీరు అనుకుంటున్నారా? అని రాస్తే మరొకరు ఇతను ఎంత మొరటు వృద్ధుడు, సిగ్గు లేదా? అని రాసుకొచ్చారు. మహిళలను అనుచితంగా తాకినట్లు నెటిజన్లు బోనీని విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. 2023లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ని ప్రారంభించిన సందర్భంగా జిగి హడిద్ నడుముపై చేయి వేసుకుని పోజులిచ్చాడు, అప్పుడు కూడా నెటిజన్లు విస్తృతంగా విమర్శించారు.