Leading News Portal in Telugu

Illicit Relationship: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో హత్య చేయించిన భార్య



Illicit Relationship

ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. తర్వాత ఏమీ ఎరుగనట్లు అనుమానం రాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు విషయాలను బయటకు రాబట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. దౌలత్‌పురాలో ఆటో గడుపుతూ జీవనం కొనసాగిస్తున్న భర్త మనోజ్.. భార్య రాధ మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా.. అదే ప్రాంతంలో నివాసముంటున్న లారీ డ్రైవర్ రాజేష్ అనే వ్యక్తి వీరి మధ్య గొడవలను ఆపేసేవాడు. దీంతో.. రాధ, రాజేష్ మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ చిగురించింది. అయితే.. ఈ విషయం భర్త మనోజ్ తెలుసుకున్నాడు. వారి మధ్య బంధాన్ని మనోజ్ వ్యతిరేకిస్తూ.. గొడవలు పెట్టేవాడు. ఈ క్రమంలో.. తమ ప్రేమకు మనోజ్ అడ్డుగా వస్తున్నాడని, రాధ తన ప్రేమికుడు రాజేష్‌తో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. కుట్రలో భాగంగా ఏప్రిల్ 7న మనోజ్‌ని లాల్కువాన్‌లోని రాజేష్ వద్దకు పంపించి డబ్బులు తీసుకురావాలని కోరింది.

GT vs RR: గుజరాత్ టార్గెట్ 197.. రాణించిన పరాగ్, శాంసన్

ఈ క్రమంలో.. రాజేష్ మనోజ్‌ని తన లారీలో కూర్చోబెట్టి దాద్రి వైపు తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో అతనికి మద్యం ఇచ్చాడు.. ఆ తర్వాత మద్యం మత్తులోకి చేరుకోగానే బట్టలు విప్పి, ఆపై తాడుతో గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ట్రక్కు క్యాబిన్‌లోనే దాచాడు. మరుసటి రోజు తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై జహాన్ దాస్నా వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.

హత్య జరిగిన విషయాన్ని రాధకు తెలియజేసిన ప్రియుడు.. తన భర్త తప్పిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాడు. దీంతో.. ఏప్రిల్ 9న రాధ సిహాని గేట్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. కాగా.. పోలీసులు విచారణ ప్రారంభించగా.. ఏప్రిల్ 8న దాద్రీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిసి.. ఆ మృతదేహం ఫొటోను అలీఘర్‌లోని అత్రౌలీలో నివసిస్తున్న మనోజ్ తండ్రి రాంఖిలాడికి చూపించారు. అతను తన కొడుకుగా గుర్తించాడు.

Yarlagadda Venkata Rao: టీడీపీలోకి చేరిన 35 ఎస్సీ కుటుంబాలు, 5 ముస్లిం కుటుంబాలు..!

కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు సూత్రధారి తన భార్య రాధే అని తెలుసుకున్నారు. ఈ క్రమంలో.. పోలీసులు బుధవారం రాధతో పాటు ప్రియుడు రాజేష్ ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు రాజేష్‌ నుంచి లారీ క్యాబిన్‌లో మనోజ్‌ మొబైల్‌, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌కార్డు, హత్యకు ఉపయోగించిన తాడు, మృతదేహాన్ని దాచేందుకు ఉపయోగించిన దుప్పటి, మృతుడి చెప్పులు స్వాధీనం చేసుకున్నారు.