Leading News Portal in Telugu

Ambati Rayudu: పవన్ కళ్యాణ్ను సీఎం చేయడానికి సిద్ధం..!



Ambati Rayudu

సిద్ధం అంటూ తాను చేసిన ట్వీట్ పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు. ‘పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం.. కలిసి సాధిద్దామని ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేశారు. కాగా తొలుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి.. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ పార్టీని వీడి జనసేనతో జత కట్టారు. ఆ తర్వాత సిద్ధం అని సోసల్ మీడియాలో ట్వీట్ చేయడంతో తిరిగి వైసీపీ గూటికి వెళ్తారనే ప్రచారం జరిగింది.. కానీ, దానిపై రాయుడు ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.

Read Also: Maharashtra Crime: ప్రియుడు కోసం ఇద్దరు పిల్లలను చంపిన తల్లి..

ఇదిలా ఉంటే.. జనసేన పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన కొందరు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రిలీజ్ చేసింది. అందులో పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు క్రికెటర్ అంబటి రాయుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మాజీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, సినీ- టీవీ నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరించనున్నారు. కాగా, అంబటి రాయుడు జనసేనకి మద్దతిస్తుండటంతో ఆయన ఆ పార్టీలో చేరే ఛాన్స్ ఉంది. దీంతో జనసైనికులు సైతం ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.