Leading News Portal in Telugu

TDP vs YSRCP: ఏపీలో పోటాపోటీగా ఎన్నికల కమిషన్ కి టీడీపీ- వైసీపీ ఫిర్యాదులు..



Ap Cec

ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుకుంటూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఇవాళ ( బుధవారం ) టీడీపీ నేతలు అధికార వైసీపీపై సీఈవోకు కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. పేర్ని నాని, పేర్ని కిట్టు బందరులో పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు అని తెలిపారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులే భయభ్రాంతులయ్యారు.. తమ అనుచరులపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారంటూ పోలీసులపై పేర్ని దాడి చేశారు.. కానీ పేర్ని నాని, కిట్టు మీద పోలీసులు చిన్నపాటి సెక్షన్లతో వదిలేశారన్నారు.

Read Also: Rahul Gandhi: ‘అబద్ధాల మూటతో చరిత్ర మారదు’.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు

కాగా, మాజీ మంత్రి పేర్ని నాని దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేస్తే బెయిలబుల్ కేసులా..? అని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించాలి.. పోలీస్ స్టేషనుపై పేర్ని నాని, పేర్ని కిట్టు దాడి చేస్తే వారి పేర్లు పెట్టకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే ఇంత దారుణం చేస్తారా?.. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలంటే పేర్ని నానిపై కేసులు పెట్టాలి అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Read Also: Health Tips : రాత్రి పడుకోనే ముందు ఒక గ్లాసు తాగితే చాలు.. ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..

ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు, వర్ల రామయ్య, అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈసీ నోటీసులిచ్చిన తర్వాత కూడా చంద్రబాబు కామెంట్లల్లో మార్పు లేదు అని పేర్కొన్నారు. సీఎం జగన్ ను ఇష్టం వచ్చిన రీతిలో విమర్శలు చేస్తున్నారు.. జరుగు జగన్.. జరుగు జగన్ అనే పేరుతో టీడీపీ ఓ పాటను రూపొందిస్తోంది.. సీఎం జగన్ను కించపరిచే విధంగా మాటలు.. పాటలు పాడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. వర్ల రామయ్య, అయ్యన్న పాత్రుడు లాంటి వారు కూడా సీఎం జగన్ను కించపరిచే విధంగా కామెంట్లు చేస్తున్నారు.. వాలంటీర్ల విషయంలో టీడీపీ ఎన్నో యూ టర్న్ లు తీసుకుంది.. వాలంటీర్ల గురించి గతంలో ఏం మాట్లాడారో గుర్తు తెచ్చుకోవాలి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.