Leading News Portal in Telugu

Geethanjali Malli Vachindhi Twitter Review : గీతాంజలి మళ్లీ వచ్చింది హిట్ కొట్టిందా? ఎలా ఉందంటే?



Geethanjali (2)

టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకు కొదవలేదు..ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ గా మరో సినిమా వస్తుంది.. కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం బోల్తా పడుతున్నాయి.. అయినా సీక్వెల్ సినిమాలు తగ్గట్లేదు.. హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గీతాంజలి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది..కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి అనే కామెడీ హారర్ మూవీ బాగానే క్లిక్ అయింది. హారర్ కథకు కామెడీ జోడించిన కోన వెంకట్ ఫార్మూలా బాగానే నచ్చింది.. ఇప్పుడు మళ్లీ గీతాంజలి సినిమా వచ్చేసింది..

ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను రంజాన్ సందర్బంగా విడుదల చేశారు.. యూఎస్‌లో షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి అయితే ఇంకా అంతగా రెస్పాన్స్ రాలేదు. సోషల్ మీడియాలోనూ అంతగా హడావిడి కనిపించడం లేదు.. అయితే ఈ మూవీకి ట్విట్టర్ లో జనాలు ఎలా రెస్పాండ్ అయ్యారో ఒకసారి చూద్దాం..

ఈ సినిమా డీసెంట్ కామెడీ హారర్ మూవీ.. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని లాగ్స్ సీన్స్ తప్పా.. చాలా వరకు ఎంటర్టైన్ చేశారని చెబుతున్నారు. కమెడియన్ కాస్టింగ్ అదిరిపోయిందట. సునీల్‌కు గ్రేట్ కమ్ బ్యాక్ అని అంటున్నారు.. కామెడీ సినిమాకు బాగుందని చెబుతున్నారు..

కామెడీ సినిమాకు ప్లస్ అయ్యిందని చాలా మంది ట్విట్టర్ యూజర్స్ చెబుతున్నారు.. కొందరికి ఫస్ట్ ఆఫ్ నచ్చితే, రెండో ఆఫ్ కూడా హిలేరియస్ కామెడితో నవ్విస్తుంది.. బోర్ కొట్టకుండా నవ్విస్తుందని ఓ యూజర్ రాసుకొచ్చాడు..

ట్విట్టర్ లో మూవీకి రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది.. అంజలి 50 వ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కోన వెంకట్ సైతం ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకోవడంతో ఈ సినిమా కాస్తైనా జనాల్లోకి వెళ్లింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి..