
Rajiv Ratan: గుండెపోటుతో హఠాన్మరణం పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరై నివాళులు అర్పించారు. రాజీవ్ రతన్ కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు. రాజీవ్ రతన్ గుండెపోటుతో మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొన సాగుతున్నారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.
Read Also: Maharashtra: ఘోరం.. పిల్లిని రక్షించబోయి బావిలో పడి ఐదుగురి మృతి
1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆయనే సారధ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, పైర్ సర్వీసెస్ డీజీగా పని చేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన ఆకస్మిక మరణం పోలీస్ శాఖను దిగ్భ్రాంతికి గురి చేసింది.