Leading News Portal in Telugu

Karumuri Sunil Kumar: బాబు, పవన్‌కు ఓపెన్‌ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై.. మీరు సిద్ధమా..?



Karumuri Sunil Kumar

Karumuri Sunil Kumar: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్‌.. చంద్రబాబు, పవన్ తణుకు సభ అట్టర్ ప్లాప్‌ అన్న ఆయన.. హైదరాబాద్ లో నా కుటుంబానికి రెండు స్టీల్ ఫ్యాక్ట్రరీలు చూపిస్తే కూటమి అభ్యర్థులకు గిఫ్ట్ గా ఇచ్చేస్తా.. ఫ్యాక్టరీలు ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా.. నిరూపించలేకపోతే మీరు రాజకీయాలు వదిలేస్తారా..? అంటూ బహిరంగ సవాల్‌ విసిరారు.. ఎవరో పనికిమాలిన వాళ్లు స్క్రిప్ట్ ఇస్తే పవన్, బాబు చదివేశారు.. పవన్ కోసం బట్టలు చించుకున్నవారిని నట్టేట ముంచారు.. మీ పార్టీ వాళ్లకు న్యాయం చేయలేని వారు ప్రజలకు ఏం చేస్తారు..? అని ప్రశ్నించారు.

Read Also: Beauty Tips: ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలంటే.. ఈ తప్పులు చేయొద్దు..

తానొక మానవ అతీత శక్తి అని పవన్ కల్యాణ్‌ అనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు కారుమూరి సునీల్.. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు.. బాబు, కొడుకులను ఇద్దరినీ ఒడిస్తా అంటున్నారు.. ముందు మీ గెలుపు గురించి ఆలోచించండి అని సూచించారు. ఒక బీసీ యువకుడిని సీఎం వైఎస్‌ జగన్‌.. ఏలూరు పార్లమెంట్ బరిలో నిలబెట్టారు. పవన్ యువకులకు ఎన్ని సీట్లు ఇచ్చారు.. బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు..? అని నిలదీశారు. మమ్మల్ని గోస్తాని నదిలో కలిపేస్తా అంటున్నారు.. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చేతికి గాజులు వేసుకుని కూర్చోలేదు అంటూ హెచ్చరించారు. గాయత్రి మంత్రం అంటూ 24 సీట్లు అన్నారు.. ఇపుడు ఇచ్చిన 21 సీట్లలో 11 సీట్లు టీడీపీ వాళ్లకే ఇచ్చారు? అని ఎద్దేవా చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తణుకులో రెండు సార్లు గెలిచిన బీసీ అభ్యర్థి కారుమూరే అన్నారు. ఇక, తణుకులో జనసేన నిలబడిందంటే విడివాడ వల్లే.. అలాంటి వ్యక్తి గొంతు పవన్ కల్యాణ్‌ తడిగుడ్డతో కోసేశారంటూ విమర్శలు గుప్పించారు ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్‌.