Leading News Portal in Telugu

SBI: ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు ఆర్‌టీఐ కింద వెల్లడించలేం



Sbi

సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అనంతరం ఎన్నికల కమిషన్.. తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: Harish Rao: ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది: హరీష్ రావు

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు వ్యక్తిగతమని.. వాటిని ఆర్‌టీఐ కింద ఇవ్వలేమని ఎస్‌బీఐ పేర్కొంది. ఈసీకి అందజేసిన తరహాలో ఎన్నికల బాండ్ల వివరాలను డిజిటల్‌ రూపంలో అందించాలంటూ కమొడోర్‌ లోకేశ్‌ బాత్రా గత నెల 13న ఎస్‌బీఐకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు అందజేశారు. అయితే ఆ వివరాలు ఇచ్చేందుకు బ్యాంకు నిరాకరించింది. దరఖాస్తుదారుడు కోరిన సమాచారం.. ఆర్‌టీఐలో మినహాయింపులు ఉన్న సెక్షన్‌ 8(1)(ఇ), సెక్షన్‌ 8(1)(జె) పరిధిలోకి వస్తుందని ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, ఆ సంస్థ కేంద్ర ప్రజా సమాచార అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: Ghaziabad: బాలికపై తల్లి స్నేహితుడు అత్యాచారం, చిత్రహింసలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఇచ్చేందుకు ఎస్‌బీఐ నిరాకరించడం విచిత్రంగా ఉందని లోకేశ్‌ బాత్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికల బాండ్ల వివరాలను బయటపెట్టకుండా ఉండేలా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేకు ఎస్‌బీఐ తరఫున ఎంత రుసుము చెల్లించారో తెలియజేయాలని కూడా బాత్రా కోరారు. ఆ వివరాలనూ బ్యాంకు వెల్లడించలేదు. ఎస్‌బీఐ నిర్ణయంపై బాత్రా తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇది కూడా చదవండి: Janata Bar Movie: హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రాయ్ లక్ష్మీ.. హీరో ఎవరంటే?