Leading News Portal in Telugu

Maldives: దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు.. తాజా నిర్ణయమిదే!



Maldives

తత్వం బోధపడితేనే గాని బుద్ధిరాదంటూరు పెద్దలు. ఈ సూత్రం మాల్దీవులకు కరెక్ట్ సరిపోతుంది. చైనా అండ చూసుకుని భారత్‌తో మాల్దీవులు కయ్యానికి దిగింది. దీంతో మాల్దీవులకు ప్రధాన ఆర్థికవనరు అయిన పర్యాటకరంగం ఒక్కసారిగా కుదేలైంది. ఆర్థికంగా ఎదురుదెబ్బలు తగలడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కాళ్లబేరానికి దిగొచ్చింది. ఏప్రిల్ 8న భారత రాయబార కార్యాలయంతో మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ సమావేశం అయ్యారు. భారత్‌లో ముఖ్యమైన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించేందుకు అనుమతి ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. తిరిగి భారతీయ పర్యాటకులను రప్పించేందుకు ప్రచారం నిర్వహిస్తామని కోరారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు భారత హైకమిషనర్‌‌కు విన్నవించారు.

 

Ke

మాల్దీవులకు భారత్‌ కీలకమైన ఆర్థికవనరుగా ఉంది. ఈ క్రమంలోనే తమ దేశాన్ని ఒక ప్రధాన గమ్యస్థానంగా మరింత ప్రోత్సహించేందుకు భారత్‌లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్‌లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని ట్రావెట్స్‌ సంస్థ పేర్కొంది. ఇండియాలో కీలకమైన ప్రధాన నగరాల్లో రోడ్ షోల నిర్వహణకు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. ఇరుదేశాల మధ్య పర్యటక సంబంధాలను పెంపొందించడంలో భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తామని ట్రావెట్స్‌ సంస్థ తెలిపింది.

మాల్దీవుల పర్యాటకుల విషయంలో మొదటి స్థానంలో ఉండే భారత్‌.. ప్రస్తుతం ఆరోస్థానానికి చేరింది. ఈ ఏడాదిలో ఏప్రిల్ 10 నాటికి మాల్దీవులకు మొత్తం 6,63,269 మంది టూరిస్టులు వచ్చారు. 71,995 మందితో చైనా అగ్రస్థానంలో ఉంది. బ్రిటన్‌ (66,999), రష్యా (66,803), ఇటలీ (61,379), జర్మనీ (52,256), భారత్‌ (37,417)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దీంతో మాల్దీవుల ఆదాయం గణనీయంగా పడిపోయింది.

ఇటీవల ప్రధాని మోడీ కేంద్రపాలిత ప్రాంతమైన లక్ష్యదీప్‌ను సందర్శించి.. భారతీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యాటకరంగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దీంతో మాల్దీవులు.. మోడీపై అక్కసు వెళ్లగక్కారు. అవమానకరమైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో భారతీయులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనలను రద్దు చేస్తున్నారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం భారతీయ పర్యాటకుల సంఖ్య మరింత పడిపోవడంతో మాల్దీవులు కాళ్లబేరానికి దిగొచ్చింది.