Leading News Portal in Telugu

AP Inter Results 2024: తొందరపాటు చర్యలొద్దు.. మే 24 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు



Ap

AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్‌ ఫస్టియర్‌తో పాటు.. సెకండియర్‌ ఫలితాలను ఇంటర్‌బోర్డు కమిషనర్‌ సౌరబ్‌ గౌర్‌ విడుదల చేశారు. ఈ సారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.. మొత్తం ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు 4,99,756 మంది కగా.. మొత్తం సెకెండ్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు 5,02,394మంది.. అయితే, ఫస్టియర్‌లో 3,10,875 మంది విద్యార్థులే అంటే 78 శాతం మంది.. సెకండియర్‌లో 3,06,528 మంది అంటే 67 శాతం ఉత్తీర్ణత సాధించారు.. ఇక, ఒకేషనల్ ఫస్టియర్‌లో 23,181 మంది విద్యార్థులు అంటే 60 శాతం ఉత్తీర్ణత.. సెకెండ్ ఇయర్‌లో 23,000 మంది పాస్‌ కావడంతో 71 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ సారి ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.. ఫస్ట్ ఇయర్‌లో 84 శాతం, సెకెండియర్‌లో 90 శాతం ఉత్తీర్ణ సాధించారు ఇంటర్‌ విద్యార్థులు.. సెకెండ్ ప్లేస్ గుంటూరు జిల్లా.. ఫస్టియర్‌లో 81 శాతం, సెకండియర్‌లో 87 శాతం ఉత్తీర్ణులయ్యారు. థర్డ్ ప్లేస్‌ లో ఎన్టీఆర్ జిల్లా ఉండగా.. ఫస్టియర్‌లో 79 శాతం, సెకండియర్‌లో 87 శాతం ఉత్తీర్ణులయ్యారు. అయితే ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, సెకండియర్‌ ఫలితాల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచాయి.

ఇక, ఇంటర్‌ ఫలితాలను ప్రకటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్.. ఫెయిల్‌ అయ్యామని విద్యార్థుల బాధ పడొద్దు.. తొందరపాటు చర్యలకు పూనుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు.. ఈ సారి కూడా బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ఎక్కువగా ఉందన్న ఆయన.. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తొందర పాటు చర్యలు వద్దు.. అంతేకాదు.. తల్లి తండ్రులు.. ఈ విషయంలో పిల్లలకు సపోర్ట్ చేయాలని సూచించారు.. ఫెయిల్‌ అయ్యారంటూ పిల్లలను అవమానించేవిధంగా మాట్లాడొద్దన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి.. ఈ సారి బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.. ఇక, మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్.

ఇంటర్  ఫలితాల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి..

Andhra Pradesh First Year Intermediate Results 2024